Begin typing your search above and press return to search.
షూటింగ్ లో దెయ్యమా?
By: Tupaki Desk | 3 Feb 2018 1:48 PM GMTహర్రర్ చిత్రాలను తెరకెక్కించే సమయంలో ఏదైనా ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే బ్యాడ్ సెంటిమెంట్లు మొదలవుతుంటాయి. ప్రతి చిన్న విషయానికి కొందరు అనుమానాలను వ్యక్తం చేస్తుంటారు. అప్పట్లో చంద్రముఖి కాన్సెప్ట్ ఆప్తమిత్ర అనే కన్నడ సినిమా తెరకెక్కిస్తున్నపుడు కొన్ని ఊహించని ప్రమాదాలు ఎదురయ్యాయి. ఆ సినిమా తెరకెక్కించిన తరువాత రిలీజ్ ముందే హిరోయిన్ సౌందర్య చనిపోవడం మరికొన్నాళ్లకు హీరో విష్ణు వర్ధన్ మరణించడం అప్పట్లో అనుమానాలను చాలానే కలిగించాయి.
అయితే హర్రర్ సినిమాలను తెరకెక్కిస్తే అప్పుడపుడు సమస్యలు ఎదుర్కోక తప్పదని కొందరు అర్ధం లేని విధంగా కామెంట్స్ చేస్తుంటారు. అయితే రీసెంట్ గా ఒక ఘటన గురించి వింటే కూడా భయం అనే అనుమానాన్ని కలిగిస్తోంది. కంబోడియా దేశంలో కొందరు హర్రర్ సినిమాను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ లో భాగంగా ఒక నటికీ దెయ్యం కాస్ట్యూమ్ తో రెడీ చేశారు. అయితే ఆమె కొద్దీ సేపటి తరువాత వింతగా ప్రవర్తించడం అందరికి భయాన్ని కలిగించింది. అందుకు సంబందించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకే చోట కూర్చొని ఒంటరిగా ఎదో మంత్రాలను చదువుతుండడం చూసి ఒక్కొక్కరు దైవాన్ని ప్రార్ధించుకోవడం స్టార్ట్ చేశారు. వారు సినిమాలో భయాన్ని ఏ లెవెల్లో చూపిద్దామనుకున్నారో గాని లైవ్ లో ముందే ఆ టెస్ట్ ను చూసేశారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకానిర్దారణ కాలేదు. కొంత మంది ఫ్రాంక్ వీడియోలని సోషల్ మీడియాలో లైకుల కోసం ప్రయోగాలు చేయడం కామన్ అయిపొయింది. బహుశా అందుకుకోసమేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.