Begin typing your search above and press return to search.
మాకు నోటీసులందలేదు-శ్యామ్
By: Tupaki Desk | 14 July 2017 10:45 AM GMTసంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు.. యువ నటుడు తనీష్. తమకు అసలు ఈ కేసులో నోటీసులు అందాయని జరుగుతున్న ప్రచారం అబద్ధమని వారు స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని శ్యామ్ కే నాయుడు తెలిపాడు. మీడియాలో వార్తలు చూసి తాను షాకయ్యానని శ్యామ్ చెప్పాడు. తానెప్పుడూ బయట ఎక్కువగా కనిపించనని.. తన పేరు ఇలా వార్తల్లోకి రావడం బాధగా ఉందని.. ఇలాంటి ప్రచారంతో తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని శ్యామ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
డ్రగ్స్ వ్యవహారంతో తనకు కూడా ఎలాంటి సంబంధం లేదని తనీష్ చెప్పాడు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. ఐతే మరోవైపు సుబ్బరాజు.. నవదీప్ మాత్రం తమకు నోటీసులు అందిన మాట వాస్తవమే అన్నారు. కానీ డగ్స్ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. తాను వైన్ మాత్రమే తాగుతానని.. డ్రగ్స్ ముట్టనని సుబ్బరాజు తెలిపాడు. మరోవైపు సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులందడంపై స్పందించాడు. శుక్రవారం ఉదయం పేపర్లో వచ్చిన సమాచారం చూసి తాను షాకయ్యానని.. ఇలాంటి ఆరోపణలు మామూలే అని.. కానీ వాస్తవాలు నిగ్గు తేలాల్సి ఉందని చెప్పాడు. కేవలం రాంగ్ కాల్ మాట్లాడినంత మాత్రాన పోలీసులు విచారణ జరపకుండా నోటీసులు జారీ చేశారని అనుకోలేమని.. కాబట్టి ఈ నోటీసుల విషయమై సీరియస్ గా ఆలోచించాల్సిందే అని ఆయనన్నారు.