Begin typing your search above and press return to search.

అఖండ బాల‌కృష్ణ కెరీర్ బెస్ట్ అనుకోవ‌చ్చా?

By:  Tupaki Desk   |   13 Dec 2021 12:30 AM GMT
అఖండ బాల‌కృష్ణ కెరీర్ బెస్ట్ అనుకోవ‌చ్చా?
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన `అఖండ` బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ముదులిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. అన్ని ఏరియాల్లోనూ `అఖండ` రికార్డు వ‌సూళ్లు దిశ‌గా ప‌య‌నిస్తోంది. రివ్యూలు నెగిటివ్ గా వ‌చ్చినా బాక్సాఫీస్ వ‌ద్ద `అఖండ` వేగాన్ని ఆప‌లేక‌పోయాయి. తాజాగా ఈ సినిమా ప‌ది రోజుల్లోనే 100 కోట్ల‌ గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి బాక్సాపీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది. ఇప్ప‌టివ‌ర‌కూ బాల‌య్య కెరీర్ లో భారీ వ‌సూళ్ల చిత్రం `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి` నిలిచింది. ఈ సినిమా 100 కోట్ల‌కు పైగా గ్రాస్ సాధించింది. ఇప్పుడా రికార్డును `అఖండ‌` బ్రేక్ చేసి స‌రికొత్త రికార్డుని తిర‌గ‌రాయ‌డానికి రెడీ అయింది.

బాల‌య్య కు వీక్ జోన్ అయిన నైజాంలో సైతం 26 కోట్ల‌కు పైగా గ్రాస్ సాధించింది. ఆంధ్రా..రాయ‌ల‌సీమ ప్రాంతాలు క‌లిపి 50 కోట్ల‌కు పైగా.. ఓవ‌ర్సీస్ లో 25 కోట్లు గ్రాస్ వ‌సూళ్లు సాధించిన‌ట్లు ట్రేడ్ లెక్క‌లు చెబుతున్నాయి. టోట‌ల్ గా `అఖండ` 100 కోట్ల‌తో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. షేర్ 60 కోట్ల‌కు ద‌గ్గ‌ర‌ల్లో ఉండ‌గా.. మొద‌టి వారంలోనే 80 కోట్లుగా గ్రాస్ లెక్క తేలింది. ఈవారం రిలీజ్ అయిన సినిమాలు కూడా `అఖండ` వేగాన్ని ఆప‌లేక‌పోయాయి. రెండ‌వ వారం కూడా `అఖండ` దూకుడు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికీ థియేట‌ర్లు హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో ర‌న్నింగ్ లో ఉన్నాయి. మొత్తానికి `అఖండ` అనూహ్య విజ‌యాన్ని అందుకున్న‌ట్లు చెప్పొచ్చు.

సినిమాపై అంచ‌నాలు ఉన్నాయి గానీ..ఈ రేంజ్ లో ఎక్స్ ప‌క్టేష‌న్స్ అయితే లేవు. యూనిట్ సైతం వ‌సూళ్లు చూసి షాక్ అవుతుంది. అదీ టిక్కెట్ రేట్లు దారుణంగా ప‌డిపోయినా `అఖండ` 100 కోట్లు తెచ్చిందంటే సామాన్య విష‌యం కాద‌ని భావించాలి. టిక్కెట్లు రేట్లు పాత ధ‌ర‌లు ఉండి ఉంటే 200 కోట్లు సునాయాసంగా సాధించేది. `అఖండ` తో బాల‌య్య బ్రాండ్ ఇమేజ్ అంత‌కంత‌కు పెరిగింది. `అఖండ‌`కు ముందు `ఎన్టీఆర్`..`రూల‌ర్ `సినిమాలు దారుణ‌మైన ఫ‌లితాలు సాధించాయి. `రూల‌ర్` గ్రాస్ వ‌సూళ్లు 15 కోట్లు కూడా లేవు. అలాంటిది `అఖండ‌` ఏకంగా 100 కోట్లు తెచ్చిందంటే బాల‌య్య ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో ప్రూవైంది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సుమారు 80కోట్లు వ‌సూలు చేసింది. అఖండ బాల‌య్య కెరీర్ బెస్ట్ గా నిలిచింద‌ని భావించాలి.