Begin typing your search above and press return to search.
ఇద్దరు బిగ్ స్టార్ ల తో నాగశౌర్య పోటీ
By: Tupaki Desk | 30 March 2022 2:30 AM GMTకరోనా కారణంగా చాలా వరకు పెద్ద చిత్రాల రిలీజ్ లు చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందుఏ. ఇప్పటికీ కొన్ని చిత్రాలు ఇంకా సరైన టైమ్ కోసం ఎదురుచూస్తూ రిలీజ్ కోసంఎదురుచూస్తున్నాయి. ఇదిలా వుంటే పెద్ద చిత్రాల మధ్య చిన్న గ్యాప్ దొరికితే చాలు చిన్న చిత్రాలు దూరిపోతున్నాయి. వారం రోజులు టైమ్ దొరికినా చాలు బాబోయ్ బయటపడిపోతాం అని పెద్ద చిత్రాలతో పోటీపడి మరీ థియేటర్లలో సందడికి సై అంటున్నాయి.
ఇదే తరహాలో యంగ్ హీరో నాగశౌర్య బిగ్ స్టార్ ల చిత్రాలతో పోటీకి రెడీ అయిపోతున్నాడు. అది కూడా మోన్ స్టార్ లా మింగేసే సినిమాలతో పోటీకి దిగుతుండటం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. గత ఏడాది వరుడు కావలెను, లక్ష్య వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగశౌర్య ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో మరో విభిన్నమై సినిమాతో రాబోతున్నాడు.
నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం `కృష్ణ వ్రింద విహారి`. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీని నాగశౌర్య సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఆయన మదర్ ఉషా ముల్పూరి నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ చిత్రంలో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా చాలా కొత్త గెటప్ లో కొత్త పాత్రలో కనిపిస్తున్నారు. షెర్లీ సెటియా హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈమూవీని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి మూవీని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగశౌర్య భారీ ప్లానే వేశాడు. ఓ కార్పొరేట్ ఆఫీస్ లో పని చేసే ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ఎలాంటి మలుపులు తిరిగింది?.. హీరోని అవాయిడ్ చేస్తూ హీరోయిన్ ఎందుకు తప్పించుకు తిరుగుతోంది? అనే ఆసక్తికర అంశాల నేపథ్యంలో ఈ మూవీ సాగనుంది.
అయితే ఈ మూవీ రిలీజ్ టైమ్ లో ఇద్దరు క్రేజీ స్టార్ లకు సంబంధించిన రెండు భారీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. అంతులో ఒకటి కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన `కేజీఎఫ్ చాప్టర్ 2`, మరొకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన `ఆచార్య`. కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న విడుదలవుతుండగా `ఆచార్య` అదే నెల 29న విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాల మధ్యలో దాదాపు 14 రోజులు అంటే రెండు వారాల గ్యాప్ వుంది. ఈ గ్యాప్ లో నాగశౌర్య `కృష్ణ వ్రింద విహారి` చిత్రంతో రాబోతున్నాడట. యావరేట్ టాక్ వచ్చినా వీకెండ్ కలెక్షన్ లతో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవచ్చన్నది నాగశౌర్య ప్లాన్. అంతే కాకుండా ఈ దఫా కొత్త కథతో వస్తుండటంతో చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడట. ఏం జరగనుందో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.