Begin typing your search above and press return to search.

మమగారి ట్రైలర్ సమంతాకు నచ్చలేదట!

By:  Tupaki Desk   |   8 Aug 2019 6:34 AM GMT
మమగారి ట్రైలర్ సమంతాకు నచ్చలేదట!
X
అక్కినేని నాగార్జున కొత్త సినిమా 'మన్మథుడు 2' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్.. ట్రైలర్ ఇతర ప్రోమోస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ బోల్డ్ కంటెంట్ కావడంతో అక్కడక్కడ విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విమర్శలపై ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో నాగార్జున క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాను సెన్సిబుల్ గా డీల్ చేశామని ప్రేక్షకులకు సర్దిచెప్తున్నారు.

అంతే కాదు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబ సభ్యులు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారో వెల్లడించారు. ఈ సినిమా ట్రైలర్ ను చూసిన తర్వాత కోడలమ్మ సమంతా 'ఇదంతా ఏంటి మామా?' అంటూ అదోరకం ఎక్స్ ప్రెషన్ ఇచ్చిందట. కానీ నాగ్ సమంతాను మరోసారి ఓపెన్ మైండ్ తో ట్రైలర్ ను చూడమని సూచించారట. అప్పుడు సమంతాకు ట్రైలర్ ఒకే అనిపించిందట. ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న ట్రైలర్ ను బోల్డ్ గా ఉండేవారు వెంటనే యాక్సెప్ట్ చేయగలరు కానీ కుటుంబ సభ్యులకు కాస్త ఇబ్బందే. మరి ఈ కంటెంట్ ను సాధారణ ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో తెలియాలంటే మనం మరో 24 గంటలు వేచి చూడాలి.

నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున - పి. కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.