Begin typing your search above and press return to search.
రజనీని మించే అర్హత డార్లింగ్ ఒక్కడికేనా?
By: Tupaki Desk | 11 March 2020 11:28 AM GMTప్రపంచ దేశాల్లో ఎక్కువ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న సౌత్ స్టార్ ఎవరు? అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ .. ఉలగనాయగన్ కమల్ హాసన్ పేర్లు ప్రముఖంగా వినిపించేవి. ఇప్పుడు సౌత్ నుంచి మరో పేరు అంతే ప్రముఖంగా వినిపిస్తోంది. అదే బాహుబలి స్టార్ ప్రభాస్. రజనీ లాగా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న స్టార్ గా నవతరం హీరోల్లో ఎవరున్నారు? అంటే... ప్రస్తుతానికి ప్రభాస్ పేరు మాత్రమే వినిపిస్తోంది.
పాన్ ఇండియా అప్పీల్ ఉన్న అతికొద్ది మంది మాస్ స్టార్లలో ప్రభాస్ పేరు సుస్థిరమైంది. ఇక అతడికి ఎంతగా ఫాలోయింగ్ ఉంది అంటే దేశ విదేశాల్లో అతడు నటించిన సినిమా ఏది? అని గూగుల్ లో వెతికేంత ఫాలోయింగ్ దక్కింది. బాహుబలి.. సాహో చిత్రాలతో అంత క్రేజు సంపాదించాడు.
ఇక ఇప్పుడు ఉత్తరాదినా ప్రభాస్ క్రేజు అసాధారణం. అతడు నటిస్తున్న తదుపరి చిత్రాలపై బాలీవుడ్ మార్కెట్లో నిరంతరం చర్చ సాగుతూనే ఉంటోందనడంలో సందేహం లేదు. బాహుబలి తర్వాత ఫ్లాప్ అనుకున్న `సాహో` సైతం ఉత్తరాదిన కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన వైనం చూసి షాక్ తిన్నారంతా.
ప్రస్తుతం ప్రభాస్ నటించిన సాహో చిత్రాన్ని భోజ్ పురి లాంటి చోట కూడా రిలీజ్ చేస్తున్నారు అంటే ప్రభాస్ కి ఉన్న డిమాండ్ ని అర్థం చేసుకోవచ్చు. సాహో రిలీజై ఇప్పటికే అమెజాన్ లో వచ్చేసింది. అక్కడ నిరంతరం వీక్షిస్తూనే ఉన్నారు. అయినా ఇంకా భోజ్ పురి భాషలోకి అనువదించి రిలీజ్ చేస్తున్నారు అంటే అక్కడ స్థానికంగా ఏ రేంజు ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని మారుమూలలకు వెళ్లి ప్రశ్నించినా ప్రభాస్ పేరు మార్మోగుతోంది. ఇక ఎక్కడో ఉన్న హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ - సిమ్లా లాంటి చోట్ల బాహుబలి స్టార్ ప్రభాస్ అంటే తెలుసుకానీ .. ఇతర తెలుగు స్టార్ల పేరు చెబితే ఎవరు? అనే పరిస్థితి ఉంది. జపాన్.. కొరియా.. చైనా.. మలేషియా అన్నిచోట్లా రజనీకి గుర్తింపు ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ప్రభాస్ కే ఇది సాధ్యం! అన్నంతగా అతడు పాపులరయ్యారు. అయితే ఇది జాన్ (ప్రభాస్ 20) బిజినెస్ కి ఏమేరకు కలిసి రానుంది అన్నది చూడాలి.