Begin typing your search above and press return to search.

ప్రస్థానం టీమ్ కు పెద్ద షాక్!

By:  Tupaki Desk   |   31 July 2019 9:18 AM GMT
ప్రస్థానం టీమ్ కు పెద్ద షాక్!
X
ఈమధ్య బాలీవుడ్ చిత్రం 'ప్రస్థానం' టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో సూపర్ హిట్ అయిన 'ప్రస్థానం'(2010) రీమేక్ ఇది. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన దేవా కట్టానే ఈ రీమేక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. సంజయ్ ఎస్.దత్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సంజయ్ సతీమణి మాన్యత దత్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టీమ్ ఇప్పుడు లీగల్ సమస్యల్లో చిక్కుకుంది.

ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ షీమారూ ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్ వారు 'ప్రస్థానం' హిందీ రీమేక్ రైట్స్ తమ వద్ద ఉన్నాయని..తమ అనుమతి లేకుండా రిమేక్ చేయడం అక్రమం అని వాదిస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే సంజయ్ దత్ కు తెలిపామని.. కానీ అదేమీ పట్టించుకోకుండా 'ప్రస్థానం' సినిమాను రీమేక్ చేశారని.. అందుకే లీగల్ నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని షీమారు ఎంటర్టైన్మెంట్స్ ప్రతినిథి తెలిపారు.

అయితే ఈ లీగల్ నోటీసు వ్యవహారంపై అటు సంజయ్.. మాన్యత కానీ.. ఇటు డైరెక్టర్ దేవా కట్టా కానీ ఇంతవరకూ స్పందించలేదు. ఇప్పటికే ఈ సినిమా విడుదలలో చాలా జాప్యం జరిగింది. అంతా సెట్ అయిందని.. ఈ సినిమాను సెప్టెంబర్ 20 న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్న టైమ్ లో ఈ కొత్త వివాదం వచ్చిపడింది. మరి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.