Begin typing your search above and press return to search.
ఇలా కూడా ప్రమోషన్స్ చేస్తారా?
By: Tupaki Desk | 30 April 2022 7:32 AM GMTసినిమా నిర్మించాక దాన్ని ప్రేక్షకుల ముందుకు విజయవంతంగా తీసుకెళ్లడానికి వివిధ రాకాలుగా మూవీ టీమ్ ప్రమోషన్స్ చేస్తూ వుంటుంది. సినిమాలో ఎంత స్టఫ్ వున్నా దాన్ని కరెక్ట్ గా ప్రేక్షకులకు చేరవేయగలిగితేనే దానికి ఆదరణ లభిస్తుంది. ఇందు కోసం మన మేకర్స్ కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు.
ఇటీవల రాజమౌళి ప్రో కబడ్డీ వేదికతో పాటు ప్రతీ ప్లాట్ ఫామ్ ని 'ట్రిపుల్ ఆర్' ప్రమోషన్స్ కోసం ఉపయోగించి సినిమాని ఇలా కూడా ప్రమోట్ చేయోచ్చా? అని అంతా అవాక్కయ్యేలా చేశారు. తన ప్లానింగ్ వల్లే 'ట్రిపుల్ ఆర్' ప్రతీ కార్నర్ కి రీచ్ కాగలిగింది.
హ్యూజ్ క్రేజ్ ని సొంతం చేసుకోగలిగింది. రాజమౌళి స్ఫూర్తితో చాలా మంది మేకర్స్ తమ చిత్రాల ప్రమోషన్స్ కోసం కొత్త కొత్త ప్లాన్ లు వేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు తమ కొత్త సినిమా ప్రమోషన్స్ ని వినూత్నంగా ప్రారంభించడం ఇప్పడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మధ్య సినిమా ల ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. దీంతో తమ కొత్త సినిమా ప్రమోషన్స్ ని వినూత్నంగా ప్లాన్ చేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు.
ఈ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం '21 సెంచరీ గ్రావెస్ట్ క్రైమ్'. పేరే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా వుంది. 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ప్యాక్టరి బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి దీపక్ దర్శకుడు. రమేష్ తమిళ మణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ ని చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ఫస్ట్ లుక్ ని ఆదివారం విడుదల చేయబోతున్నారు.
తెలుగులో రెడ్ కలర్ థీమ్ లో, తమిళంలో వైట్ కలర్ థీమ్ లో ఈ ప్రీలుక్ పోస్టర్ ని విడుదల చేశారు. నలుగురు సారిశుద్య కార్మికులు ఓ సిమెంట్ దిమ్మెపై కూర్చుని టీ తాగుతూ కనిపిస్తున్నారు. 21 సెంచరీ గ్రావెస్ట్ క్రైమ్ అంటూ మేకర్స్ విడుదల చేసిన ఈ ప్రీలుక్ ఆకట్టుకుంటోంది.
అయితే ఈ పోస్టర్ ని చూసిన వారంతా ప్రమోషన్స్ ని ఇలా కూడా చేస్తారా? అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇంతకీ 21 సెంచరీ గ్రావెస్ట్ క్రైమ్ ఏంటీ? .. ఎక్కడ జరిగింది? .. ఎవరు చేశారు?.. అన్నది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీని వెనకున్న అసలు కథేంటన్నది తెలియాలంటే ఆదివారం ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.