Begin typing your search above and press return to search.
రెడ్డి గారు ఈ సినిమాతో ఫామ్ లోకి వస్తారా?
By: Tupaki Desk | 12 Nov 2019 9:09 AM GMTఈ వారంలో విడుదల కాబోతున్న 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' సినిమాతో దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ఫామ్ లోకి వస్తారా? అనేది ఆసక్తిదాయకంగా మారింది. తెలుగులో ఆసక్తిదాయకమైన కామెడీ సినిమాలు తీసిన వారిలో నాగేశ్వర్ రెడ్డి ఒకరు.
'సిక్స్ టీన్స్' తో మొదలైంది నాగేశ్వర్ రెడ్డి ప్రస్థానం. ఆ సినిమా మ్యూజికల్ గా, కాన్సెప్ట్ పరంగా ఆకట్టుకుంది. అప్పట్లో మంచి హిట్ నమోదు చేసింది. ఆ తర్వాత 'గర్ల్ ఫ్రెండ్', 'ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి' వంటి సినిమాలు ఒక మోస్తరుగా ఆడాయి.
నాగేశ్వర్ రెడ్డి కెరీర్ లో 'సీమశాస్త్రి' చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఆ సినిమా టీవీల్లో బ్రహ్మాండంగా ఆడింది. 'కాస్కో' వంటి మాస్ సబ్జెక్ట్ తో ఆకట్టుకోలేకపోయాడు కానీ, 'సీమ టపాకాయ్' తో మళ్లీ మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ దర్శకుడు.
దేనికైనా రెడీ, కరెంటు తీగ, ఈడో రకం-ఆడోరకం.. ఇలా హ్యాట్రిక్ సినిమాలు బాగా ఆడాయి. అయితే ఆ తర్వాత నాగేశ్వర్ రెడ్డి ఫామ్ కోల్పోయారు. ఆడాడుకుందాం రా, ఇంట్లో దెయ్యం-నాకేం భయం, ఆచారి అమెరికా యాత్ర… ఈ మూడు సినిమాలూ డిజాస్టర్లే. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు 'తెనాలి రామకృష్ణ'తో వస్తున్నాడు నాగేశ్వర రెడ్డి. ఈ సినిమా వినోదాత్మకంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ డైరెక్టర్ విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నెల పదిహేనున ఈ సినిమా విడుదల కాబోతోంది.