Begin typing your search above and press return to search.
'ఫ్యామిలీ మ్యాన్ 2' వివాదంపై సామ్ సైలెంటుగా ఉందేంటి..?
By: Tupaki Desk | 28 May 2021 11:30 AM GMT'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ద్వారా సమంత అక్కినేని వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె నెగిటివ్ రోల్ లో కనిపించనుంది. సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ 1' కు కొనసాగింపుగా వస్తున్న సీజన్ 2 లో మనోజ్ భాజ్ పాయ్ - ప్రియమణి కూడా కీలక పాత్రలు పోషించారు. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ట్రైలర్ విడుదల తర్వాత అనుకోని విధంగా ఈ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది.
'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ తమ మనోభావాలను కించపరిచేలా ఉందంటూ తమిళ తంబీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన LTTE కి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు చూపించారని.. తమిళ నటి అయిన సమంత ఇలాంటి పాత్రలో నటించడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికల్లో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో 'ఫ్యామిలీ మ్యాన్' ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు.
అయితే తనపై వస్తున్న ట్రోల్స్ పై సామ్ ఇంతవరకు స్పందించలేదు. సోషల్ మీడియాలో పెద్ద ఆమెను పెద్ద ఎత్తున విమర్శిస్తూ ట్రోల్స్ చేస్తున్నా సమంత వాటిని స్వీకరిస్తూ సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత అలాంటి పాత్రను ఎందుకు చేసిందో జనాలు అర్థం చేసుకుంటారని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అలాంటి వాటిపై స్పందించాల్సిన అవసరం లేదనేది సామ్ భావనగా అనిపిస్తోంది. ఇటీవల ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ సేయింగ్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గత వారం 'ప్రశాంతంగా ఉండండి.. విశ్వాసం కలిగి ఉండండి' అని సమంత ఓ ట్వీట్ చేసింది.
ఇదిలాఉండగా 'ఫ్యామిలీ మ్యాన్' వివాదంపై దర్శకద్వయం రాజ్ & డీకే స్పందించారు. ట్రైలర్ లోని కేవలం రెండు షాట్ల ఆధారంగా ఈ ఊహాగానాలు వచ్చాయని అన్నారు. తమిళ ప్రజల మనోభావాలు, వారి సంస్కృతి గురించి తమకు తెలుసని.. తమిళ ప్రజల పట్ల ఎంతో ప్రేమ గౌరవం తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు. చాలా కష్టపడి రూపొందించిన ఈ సిరీస్ విడుదలయ్యే వరకు వేచి చూడాలని.. చూసిన తర్వాత మీరే అభినందిస్తారని రాజ్ అండ్ డీకే చెప్పుకొచ్చారు.