Begin typing your search above and press return to search.
ఈ సినిమాతోనైనా సంతోష్ కి పని అవుద్దా..?
By: Tupaki Desk | 6 Oct 2022 12:30 PM GMT'తను నేను' అనే చిత్రంతో హీరోగా పరిచయమైన సంతోష్ శోభన్.. ఇండస్ట్రీలో నిలదిక్కుకోడానికి గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఇందులో భాగంగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వస్తున్నా.. ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కడం లేదు. గతేడాది 'మంచి రోజులొచ్చాయి' తో నిరాశ పరిచిన సంతోష్.. ఇప్పుడు ''లైక్ షేర్ & సబ్స్క్రైబ్'' అనే సినిమాతో అలరించడానికి వస్తున్నాడు.
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' 'ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ''లైక్ షేర్ & సబ్స్క్రైబ్'' సినిమా తెరకెక్కింది. ఇందులో సంతోష్ శోభన్ సరసన 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
దసరా పండుగను పురస్కరించుకుని 'లైక్ షేర్ & సబ్స్క్రైబ్' సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. నవంబర్ 4వ తేదీన థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓ సరికొత్త అనౌన్స్ మెంట్ పోస్టర్ ని వదిలారు. ఇందులో సంతోష్ మరియు ఫారియా బ్రీఫ్ కేస్ లపై కూర్చొని ఉన్నారు. ఇద్దరూ చాలా అందంగా కనిపిస్తున్నారు.
రొమాన్స్ మరియు సస్పెన్స్ తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులో యూట్యూబ్ చానెల్ కోసం వీడియోలు చేసి మంచి ట్రావెల్ బ్లాగర్ అనిపించుకోవాలకునే ఔత్సాహిక యువకుడిగా సంతోష్ కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన 'లైక్ షేర్ & సబ్స్క్రైబ్' ఫస్ట్ లుక్ & టీజర్ కు మంచి స్పందన లభించింది. సంతోష్ - ఫారియా జంట ఆకట్టుకుంది. నెల్లూరు సుదర్శన్ ఈ సినిమాలో నవ్వించే బాధ్యత తీసుకున్నారు. ఆముక్త క్రియేషన్స్ తో కలిసి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లికి ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి వెంకటరత్నం (వెంకట్) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
ప్రవీణ్ లక్కరాజు - రామ్ మిరియాల ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. వసంత్ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు. చాలా కాలంగా సరైన థియేట్రికల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న 'ఏక్ మినీ కథ' హీరో.. 'లైక్ షేర్ & సబ్స్క్రైబ్' సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఇకపోతే దీని తర్వాత సంతోష్ శోభన్ 'ప్రేమ్ కుమార్' 'అన్నీ మంచి శకునములే' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.