Begin typing your search above and press return to search.

ఆ 'డీల్ 'తో ఎన్టీఆర్ సౌత్ ని షేక్ చేస్తాడా?

By:  Tupaki Desk   |   21 Feb 2019 11:45 AM IST
ఆ డీల్ తో ఎన్టీఆర్ సౌత్ ని షేక్ చేస్తాడా?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్! టాలీవుడ్ యాక్టింగ్ ట్యాలెంట్స్ లో యౌన్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. నటనలో కానీ, డ్యాన్స్ లో కానీ, డైలాగ్స్ లో కానీ, ఇలా ఏ రకంగా చూసుకున్నా ఆయన తీరు అద్భుతం అనే చెప్పాలి. ఇక ఆయన తాజాగా నటించి మెప్పించిన సినిమా అరవింద సమేతాలో ఆయన నటన ఔరా అనిపించేలా ఉంది. త్రివిక్రమ్ టచ్ తో ఎన్టీఆర్ నటనతో ఆ సినిమా మంచి హిట్ అందుకుంది అని అందరికీ తెల్సిన విషయమే. మరి అలాంటి ఎన్టీఆర్ ఒక ప్రముఖ సంస్థకు ఒక డీల్ సైన్ చేశాడట. ఈ డీల్ తో ఎన్టీఆర్ సౌత్ మొత్తాన్ని ఊపెయ్యనున్నాడట...ఇంతకీ ఏంటి ఆ డీల్? ఏమి ఆ కధ అంటే...

అందరికీ తెలిసిన విషయమే మన సౌత్ ఇండియన్ స్టార్స్ లో ఇటు సినిమాల్లోనే కాకుండా వాణిజ్య ప్రకటనలలో కూడా ఆదరకొట్టే వారిలో మన ప్రిన్స్ మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నారు అని. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ సైతం పలు యాడ్స్ లో కనిపిస్తూ రోజు టీవీలో తన ఫాన్స్ ను అలరిస్తున్నాడు. అయితే ఈ యాడ్స్ లో భాగంగానే ప్రముఖ సంస్థ అయిన పార్లే ఆగ్రోతో ఎన్టీఆర్ ఒక డీల్ కి సైన్ చేసాడని...అయితే ఈ దెబ్బతో టోటల్ సౌత్ ఇండియా మొత్తంగా ఈ సంస్థ తయారు చేస్తున్న యాప్పి ఫిజ్ ను ఎన్టీఆర్ ప్రమోట్ చెయ్యనున్నాడు. ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది అని, భారీగానే ఎన్టీఆర్ కి పారితోషకం సమర్పిస్తున్నారు అన్నది బిజినెస్ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్త.

ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, ఈ ప్రాడక్ట్ ను నార్త్ లో మన సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నాడు. అక్కడ ఆయన...ఇక్కడ ఈయన ఈ ప్రాడక్ట్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టి మార్కెట్ లో టాప్ పొసిషన్ కి తీసుకు వెళ్లేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే యాప్పి ఫిజ్ మార్కెట్ లో మంచి లాభాలతో దూసుకుపోతూ ఉండగా..దీన్ని మరింత రెట్టింపు చేసే భాద్యతని ఎన్టీఆర్ అండ్ సల్మాన్ తీసుకునారన్న మాట. ఈ కోవలోనే సదరు సంస్థ వారు తాజాగా మైసూరులో ఉత్పత్తులను తయారు చేసే యూనిట్ ను కూడా మొదలు పెట్టారు. మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ టచ్ తో ఈ యాప్పి ఫిజ్ భారీ లాభాలను రుచి చూస్తుంది ని చెప్పవచ్చు.