Begin typing your search above and press return to search.
తలైవి`కి ఓటీటీలోనూ తిప్పలేనా?
By: Tupaki Desk | 26 Sep 2021 2:30 AM GMTబాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన `తలైవి` ఇటీవలే థియేటర్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయి రెండు వారాలు గడిచిపోవడంతో గత రాత్రే సినిమా హిందీ వెర్షన్ నెట్ ప్లిక్స్ ఓటీటీలో స్ర్టీమింగ్ కూడా మొదలైంది. ఇక తెలుగు..తమిళ్ వెర్షన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అయితే ఈ ప్లాట్ ఫాం పై ఇంకా స్ర్టీమింగ్ కి రాలేదు. ఈ నేపథ్యంలో `తలైవి`కి ఓటీటీలోనూ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే `తలైవి` పైరసీ జరిగింది. కొన్ని వెబ్ సైట్స్ లో ప్రింట్ లు వైరల్ అవుతున్నాయి. ఇక నెట్ ప్లిక్స్ హిందీ వెర్షన్ వచ్చేస్తే చాలా మంది ఆడియన్స్ ముందుగా అందులోనే చూస్తారు.
అలాగే హెచ్ డీ ప్రింట్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా చూస్తే తెలుగు..తమిళ్ వెర్షన్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ కి ఇది భారీ నష్టమని అంటున్నారు. అయితే అమెజాన్ ప్రైమ్ లెక్కలు మరోలా కనిపిస్తున్నాయి. నెట్ ప్లిక్స్ లో వీక్షించాలంటే కాస్ట్ ఎక్కువ. అదే ఆమెజాన్ లో తక్కువ ధరకే `తలైవి` అందుబాటులో ఉంటుంది. పైగా నెట్ ప్లిక్స్ కన్నా ఆమెజాన్ కే సౌత్ లో ఎక్కు మంది సబ్ స్ర్కైబర్లు ఉన్నారు అన్న ధీమా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఇది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కథ కాబట్టి ఇక్కడ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతుందని..నెట్ ప్లిక్స్ కన్నా అమెజాన్ ప్రైమ్ స్ర్టీమింగ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ట్రేడ్ సైతం అంచనా వేస్తోంది. ఇలా ఎవరి క్యాలుక్లేషన్స్ వాళ్లకి ఉన్నాయి.
ఇక థియేటర్లో `తలైవి` పెద్ద ఎత్తున రిలీజ్ కాని సంగతి తెలిసిందే. మహరాష్ర్టలో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడంతో అరకొరకగానే రిలీజ్ అయింది. దీంతో కంగనా ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. తలైవి చిత్రానికి ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ ఈ చిత్రం అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది.