Begin typing your search above and press return to search.
వారసుడు భయపెడుతున్న రన్ టైం..!
By: Tupaki Desk | 8 Jan 2023 6:37 AM GMTటాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో వారిసు సినిమా చేసిన విషయం తెలిసిందే. తెలుగులో వారసుడుగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు నిర్మాత దిల్ రాజు. విజయ్ కి 100 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఈ సినిమా తీసినట్టు టాక్. సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, శ్యాం ఇలా భారీ తారాగణంతో వారిసు తెరకెక్కించారు. రష్మిక మందన్న కథానాయికగా నటించడం కూడా ఈ సినిమాకు మరో ప్లస్ అయింది. ఇన్ని భారీ అంశాలు ఉన్నాయి కాబట్టే తెలుగులో ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించుతున్నారు దిల్ రాజు.
వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డిలకు పోటీగా బరిలో దిగుతున్న వారసుడు సినిమా రన్ టైం విషయంలో ఫ్యాన్స్ ని భయపెడుతున్నాడు. అసలే ట్రైలర్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయని తెలుస్తున్న ఈ మూవీ రన్ టైం కూడా 2 గంటల 50 నిమిషాలు అంటే 170 నిమిషాలు దాకా ఉంటుందని తెలుస్తుంది. సెన్సార్ టీం యు సర్టిఫికెట్ ఇచ్చినా సినిమా రన్ టైం అంత ఎక్కువ ఉండటం ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది. విజయ్ సినిమాను తెలుగులో భారీగా రిలీజ్ చేస్తున్నారు దిల్ రాజు.
కోలీవుడ్ లో మాత్రం వారిసు సినిమా సంచలనం సృష్టించేలా ఉంది. విజయ్ ఇమేజ్ కు కంప్లీట్ ఫుల్ ప్యాక్డ్ మూవీగా ఈ సినిమా అక్కడ ప్రేక్షకులను అలరించేలా ఉంది. దళపతి ఫ్యాన్స్ కి ఈ సినిమా కచ్చితంగా సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. అయితే తెలుగులో మాత్రం ఇలాంటి కథలు చాలా వచ్చాయన్న భావన ఉంది. అందుకే తెలుగులో సినిమాని సరిగా ప్రమోట్ కూడా చేయట్లేదు దిల్ రాజు.
సినిమా రిలీజ్ జనవరి 11న ఫిక్స్ చేయగా తెలుగులో ఇంతవరకు సినిమాకు సంబంధించిన ఈవెంట్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి చిరు, బాలయ్య సినిమాలకు పోటీగా సినిమాని వదులుతూ ఇంత పేలవమైన ప్రమోషన్స్ చేస్తే ఎలా అంటూ ఆడియన్స్ అంటున్నారు. కథలో విషయం ఉంటే ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా వర్క్ అవుట్ అవుతుంది. మరి దిల్ రాజు వారసుడు ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి ప్లాన్ వేస్తున్నారో చూడాలి. వారసుడు కోసం విజయ్ ని హైదరాబాద్ రప్పించాలని దిల్ రాజు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.