Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ ఏ స్టార్ అవుతాడు?

By:  Tupaki Desk   |   4 Oct 2018 9:11 AM GMT
విజయ్ దేవరకొండ ఏ స్టార్ అవుతాడు?
X
ఇప్పటికింకా విజయ్ దేవరకొండ పేరు ముందు ఎలాంటి స్టార్ ట్యాగ్ లేదు కానీ ఆ రోజు దగ్గర్లోనే ఉంది. పెళ్లి చూపులు హిట్ అయినప్పుడు దాని క్రెడిట్ లో అధిక శాతం దర్శకుడు తరుణ్ భాస్కర్ కు వచ్చింది నిజం. విజయ్ దేవరకొండ తన టాలెంట్ తో పాత్రను నిలబెట్టినప్పటికీ హీరోయిన్ రీతూ వర్మతో సహా విజయానికి చాలా కారణాలు సమిష్టిగా నిలబడ్డాయి. కానీ అర్జున్ రెడ్డి ఈ సమీకరణాలు పూర్తిగా మార్చేసింది. సందీప్ రెడ్డి వంగాకు ఎంత పేరు వచ్చినా డ్రగ్స్ కు అలవాటు పడిపోయి దేన్నైనా విపరీతంగా ప్రేమించే అలవాటు ఉన్న విన్నూత్నమైన పాత్రను తన యాటిట్యూడ్ తో పండించిన తీరు విజయ్ దేవరకొండను ఒకేసారి పది మెట్లు పైకి తీసుకెళ్ళిపోయింది.

ఇక గీత గోవిందం హిట్ సంగతి సరేసరి. కాకపోతే కొంత భాగం రష్మిక మందన్న దర్శకుడు పరశురామ్ కూడా తీసుకోవడంతో విజయ్ లీడ్ గా నిలిచాడు. ఇప్పుడు నోటా వస్తోంది. పొలిటికల్ జానర్ అనేది సాధారణ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యే జానర్ కాదు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోతోంది. పబ్లిసిటీ కాస్త వీక్ గా ఉన్నా మ్యూజిక్ కు అంత రెస్పాన్స్ రాకపోయినా నోటా కోసం ఇంత డిమాండ్ ఉండటం చిన్న విషయం కాదు. తన బ్రాండ్ మీద ఓపెనింగ్స్ సాధించే రేంజ్ కు విజయ్ దేవరకొండ చేరుకున్నాడు. ఇందులో సందేహం లేదు. 40 కోట్ల సినిమాలు రెండు వచ్చేసాయి. ఇక పది సినిమాల వయసు కూడా లేని ఓ హీరోకి తెల్లవారుఝామున ప్రీమియర్ షోలు వేస్తే అన్ని హౌస్ ఫుల్ కావడం అనేది అందరికి జరగదు. పరిశ్రమకు వచ్చి పదేళ్లయినా మార్నింగ్ షోకి సగం థియేటర్ ని నింపలేని హీరోలకు కొదవలేదు. అలాంటప్పుడు కేవలం మూడేళ్ళ వ్యవధిలో ఇంత స్థాయికి చేరుకోవడం చిన్న విషయం కాదు. ఇది నిలబెట్టుకోవాలి.

పరిశ్రమ సక్సెస్ కు సింహాసం ఇస్తుంది నిజమే. కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఓదార్చదు. నిర్మొహమాటంగా పక్కకు నెట్టేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి అంతటి హీరోనే 1995 లో అసలు మేకప్ వేసుకోకుండా కేవలం పరాజయాలను విశ్లేషించడానికే ఏడాది సమయం తీసుకున్నారు. పరాజయం కొట్టే దెబ్బ ఎక్కడైనా కాస్త అటుఇటుగా ఉంటుందేమో కానీ సినిమా పరిశ్రమలో మాత్రం గట్టిగా పడుతుంది. పైగా విజయ్ కు అభిమానుల అండ మాత్రమే ఉంది. వెనుక ప్రొడక్షన్ హౌస్ లేదు. మొన్న స్టార్ట్ చేసాడు కానీ అన్ని తనే తీసుకోలేడు కదా. సో సాలిడ్ గా ఓ మూడునాలుగేళ్ళు హిట్స్ కొడుతూ పోతే విజయ్ స్టార్ స్టేటస్ అందుకోవడం ఎంతో దూరం లేదు. కాకపోతే కథల విషయంలో చాలా ఏమరుపాటుగా ఉండాలి. కాంబోలను చూసి మోసపోకూడదు. ట్రాక్ రికార్డ్స్ ని జాగ్రత్తగా స్టడీ చేయాలి. రెండు మిలియన్ డాలర్ల సత్తా ఉందని ఇంత తక్కువ టైంలో ప్రూవ్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవాలి అంటే సెట్స్ మీద ఉన్నవి కాకుండా రాబోయే వాటి మీద ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మరి విజయ్ పేరు పక్కన రౌడీ స్టార్ అని వస్తుందా లేక ఇంకేదైనా పెడతారా అనేది కాలమే సమాధానం చెప్పాలి