Begin typing your search above and press return to search.

కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. దుస్తులు లేకుండా యువతి నిరసన

By:  Tupaki Desk   |   21 May 2022 8:30 AM GMT
కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. దుస్తులు లేకుండా యువతి నిరసన
X
కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ గత కొన్ని రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ సినీ వేడుకకు దేశ విదేశాల నుంచి అగ్ర ప్రముఖ నటీనటులు సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా టాలీవుడ్ నుంచి కూడా గ్లామరస్ హీరోయిన్స్ వేడుకలో పాల్గొన్నారు. అందులో తమన్నా భాటియా, పూజా హెగ్డే కూడా ఉన్నారు. ఇక అతిరథ మహారాదుల నడుమ జరుగుతున్న ఈ కలర్ఫుల్ వేడుకలో హఠాత్తుగా ఒక షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది.

ఫిల్మ్ ఫెస్టివల్‌ వేదికగా రెడ్ కార్పెట్‌ పై కొంతమంది ప్రముఖ సెలబ్రెటీలు వెళుతుండగా హఠాత్తుగా జనాల్లో నుంచి వచ్చిన ఒక మహిళ అందరిని కంగారు పెట్టింది. సెక్యూరిటీని దాటుకుంటూ ఒక మహిళ తన దుస్తులను కూడా విప్పేసి నిరసనలు తెలిపింది. ఉక్రెయిన్‌కు చెందిన ఆ మహిళ అందరూ చూస్తుండగానే అర్ధనగ్నంగా వినూత్న నిరసన తెలిపింది. గత కొంతకాలంగా తమ దేశమైన ఉక్రెయిన్‌ లో మహిళలు, యువతులపై రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని అంటూ నినాదాలు చేసింది.

ఇక ఆమె అర్ధనగ్న స్థితిలో నినాదాలు చేయడంతో అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. ఇక వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది సదరు మహిళను మరొక బట్టతో కప్పేసి అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. కలర్ఫుల్ గా సందడిగా కొనసాగుతున్న కార్యక్రమంలో మహిళ ఆ విధంగా నిరసనలు తెలపడం చర్చనీయాంశంగా మారుతోంది.

ఉక్రెయిన్ కు సంబంధించిన జెండా రంగులను కూడా ఆ మహిళ తన శరీరంపై వేయించుకుంది. ఒక్కసారిగా రెడ్‌ కార్పెట్‌ పైకి వచ్చి ఉక్రెయిన్ మహిళను కాపాడాలని నినాదాలు చేసింది. అంతే కాకుండా ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారం జరుగుతుంటే మానవత్వం నశించిందని ఆడవాళ్లు ఏడుస్తుంటే ఇక్కడ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నారు అని ఆమె కన్నీటితో వివరణ ఇచ్చింది. ప్రపంచ దేశాలు మాపై అత్యాచారం ఆపేందుకు ప్రయత్నం చేయాలని కూడా నినాదాలు చేస్తూ నిరసల ప్రదర్శించింది.

ఇక ఇదే విషయంప ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఎమోషనల్ అయ్యారు. లైవ్‌ శాటిలైట్‌ వీడియో ద్వారా కేన్స్‌ ప్రారంభోత్సవంలో జెలెన్‌ స్కీ మాట్లాడుతూ.. రష్యా బలగాల దాడుల్లో తమ ఉక్రెయిన్ దేశ పౌరులు వేల సంఖ్యలో చనిపోతుంటే సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా అని ప్రశ్నిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రష్యా రోజురోజుకు దారుణంగా దురాగతాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.