Begin typing your search above and press return to search.
బడా ఫ్యామిలీ డెబ్యూ హీరోకి ఇంకా హీరోయిన్ దొరకలేదా..??
By: Tupaki Desk | 4 Jun 2021 3:30 AM GMTతెలుగు చిత్రపరిశ్రమకు తన ప్రతి సినిమాతో కొత్తవాళ్ళను.. అంటే హీరోలు హీరోయిన్లను పరిచయం చేసే దర్శకులలో డైరెక్టర్ తేజ ముందుంటాడు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ముప్పైఏళ్లకు పైనే అవుతున్నా తేజ ఇప్పటివరకు స్టార్ డైరెక్టర్స్ లిస్టులో స్థానం పొందలేకపోయాడు. కానీ సినిమాలు మాత్రం గ్యాప్ లేకుండా చేస్తూనే ఉన్నాడు. తేజ హిట్స్ ప్లాప్స్ అనేవి పట్టించుకోడు. ఆ విషయం పక్కనపెడితే తేజ ప్రతి సినిమాతో న్యూ ఆర్టిస్ట్ లను ఖచ్చితంగా పరిచయం చేస్తాడు. త్వరలోనే మరో హీరో హీరోయిన్లతో పరిచయం చేయనున్నాడు. అయితే ఇప్పటివరకు దర్శకుడుగా తేజ ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్స్ ఇండస్ట్రీలో ఏదొక విధంగా కంటిన్యూ అవుతున్నారు.
తాజాగా మరోసారి తన డెబ్యూ మూవీతో సీక్వెల్ ప్లాన్ చేసాడు. ఆయన డెబ్యూ 'చిత్రం' మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. సుమారు ఇరవై ఏళ్ల కిందటే అంటే 2000 సంవత్సరంలో విడుదలైన ‘చిత్రం' అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ ధర్మతేజ కాస్తా డైరెక్టర్ తేజ అయిపోయాడు. అప్పటినుండి డైరెక్టర్ గానే కంటిన్యూ అవుతున్నాడు. ఇటీవలే తేజ 'చిత్రం1.1' సినిమాను ప్రకటించి సర్ప్రైజ్ చేసాడు. చిత్రం మూవీకి సీక్వెల్ కాబట్టి సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
అయితే అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా ద్వారా దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో అరంగేట్రం చేయబోతున్నాడు. నిర్మాత సురేష్ బాబు రెండో తనయుడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో ఆర్పీ పట్నాయక్ మరోసారి రీఎంట్రీ చేయనున్నాడు. ఇదిలా ఉండగా.. అంతా బాగానే ఉంది కానీ అభిరామ్ పక్కన హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తేలని ప్రశ్న. మరి డైరెక్టర్ చూస్తే కొత్త హీరోయిన్ను పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇటువైపు నిర్మాత విషయానికి వస్తే కొడుకు డెబ్యూ కోసం ఓ క్రేజ్ ఉన్నటువంటి యంగ్ హీరోయిన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. మరి ఎవరు ఓకే అవుతారో గాని ప్రస్తుతం అయితే యంగ్ బ్యూటీ కేతిక శర్మ పేరు బలంగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుందని టాక్. చూడాలి మరి దగ్గుబాటి వారసుడి డెబ్యూ ఎలా ఉండబోతుందో..!