Begin typing your search above and press return to search.

సిల్లీ ఫెలోస్ దగ్గర అలా ఉండలేం

By:  Tupaki Desk   |   19 Oct 2016 7:30 PM GMT
సిల్లీ ఫెలోస్ దగ్గర అలా ఉండలేం
X
శృతి హాసన్ ను చూడగానే డేరింగ్ అండ్ డాషింగ్ అనిపించేస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు కావడం.. తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకుందా అనిపించే స్పీడ్ చూపించడంతో.. ఈ అమ్మడిని అందరూ అలాగే అనుకుంటూ ఉంటారు. అలాగే.. ఈవిడకు సింగింగ్ ట్యాలెంట్ బాగా ఉండడం.. సంగీతంపై విపరీతమైన మక్కువ ఉండడంతో.. రాక్ స్టార్ రేంజ్ లో ఉంటుందని ఎక్స్ పెక్టేషన్స్ చాలామందిలో ఉంటాయట.

ఈ సంగతిని స్వయంగా శృతి హాసన్ చెప్పడం విశేషం. అంతే కాదు.. అందరూ తన గురించి అలా అనుకున్నా.. 'నేను బాగా రొమాంటిక్. కానీ అలా ఉండాలంటే.. అవతలి వాళ్లకు అర్హత ఉండాలి. సిల్లీ ఫెలోస్ దగ్గర అలా ఉండలేం కదా. నాకు రాక్ టైపు మ్యూజిక్ ఇష్టం అనుకుంటారు కానీ.. బాడీగార్డ్ లో ఐలవ్యూ లాంటి సాంగ్స్ ఇష్టం. అందులో సరదాతో పాటే కొంచెం అమాయకత్వం కూడా కంబైన్డ్ గా ఉంటుంది' అని చెప్పింది శృతి హాసన్.

జూమ్ ఛానల్ లో దివాలీ మస్తీ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఈ సౌత్ బ్యూటీ.. గతంలో దిల్ తో బచ్చా హై జీలో ఇమ్రాన్ హష్మీతో చేసేందుకు భయపడ్డానంటూ.. తాను ఎంత సున్నితమో కూడా చెప్పింది. కానీ ఇమ్రాన్ చాలా మంచోడని.. అలాగే గబ్బర్ ఈజ్ బ్యాక్ లో జోడీ కట్టిన అక్షయ్ కుమార్ అమేజింగ్ అంటూ.. బోలెడన్ని కబుర్లు చెప్పింది. ఇంతకీ ఎవరితో రొమాంటిక్ గా ఉంటుందో మాత్రం చెప్పలేదు లెండి. చెప్పకపోయినంత మాత్రాన విషయం బయట పడకుండా ఉంటుందా ఏంటి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/