Begin typing your search above and press return to search.
క్యాంటీన్ సాంగ్: సింగిల్ షాట్ మేకింగ్ వీడియో
By: Tupaki Desk | 5 July 2019 6:50 AM GMTభరత్ కమ్మ దర్శకత్వంలో టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'డియర్ కామ్రేడ్'. విజయ్ క్రేజ్ పీక్స్ లో ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే 'డియర్ కామ్రేడ్' ప్రోమోస్ కూడా సినిమాపై బజ్ పెంచుతున్నాయి.
ఈమధ్యే 'డియర్ కామ్రేడ్' చిత్రం నుంచి క్యాంటీన్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 'కాలేజీ క్యాంటీను అంటేనే ప్రేమ పక్షులకు హెవెను' అంటూ సాగే ఈ కాలేజీ స్టూడెంట్స్ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. న్యాచురల్ ఫీల్ తో చిత్రీకరించడమే కాకుండా ఒక సింగిల్ షాట్ లో ఈ పాటను చిత్రీకరించడం అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సింగిల్ షాట్ మేకింగ్ వీడియోను 'డియర్ కామ్రేడ్' టీమ్ రిలీజ్ చేసింది. కెమెరామ్యాన్ ను ఫాలో అవుతూ.. ఆయన చిత్రీకరిస్తున్న దేవరకొండ గ్యాంగ్ హంగామాను కూడా కవర్ చేస్తూ తీసిన ఈ మేకింగ్ వీడియో ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.
విజయ్ దేవరకొండ సినిమాలకు ఎందుకు అంత క్రేజ్ ఉంటుంది అనే ప్రశ్న వేసుకుంటే ఇలాంటి యూత్ ను మెప్పించే పాటలు.. న్యాచురల్ గా అనిపించే చిత్రీకరణను ఎంకరేజ్ చేయడమే అని చెప్పవచ్చు. 'శివ' లో 'బోటనీ పాఠముంది' పాట తర్వాత తెలుగులో వచ్చిన ఆథెంటిక్ కాలేజ్ సాంగ్ ఇదేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మలయాళం సూపర్ హిట్ సాంగ్ 'జిమ్మిక్ కమ్మల్' స్టైల్ చిత్రీకరణ ఉన్నప్పటికీ ఈ పాట మాత్రం ఆడియన్స్ కు సూపర్ గా కనెక్ట్ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు జీ.. మేకింగ్ కో దేఖో జీ!