Begin typing your search above and press return to search.
వేడెక్కిస్తున్న `కెప్టెన్ మార్వల్`
By: Tupaki Desk | 6 March 2019 6:08 AM GMTసూపర్ హీరో సినిమాలకు ఇండియాలో ఉన్న డిమాండ్ తెలిసిందే. భారీ హాలీవుడ్ చిత్రాలు మన దేశంలో రిలీజై ఏకంగా 300కోట్లు కొల్లగొట్టేస్తున్నాయి. ప్రాంతీయ భాషల నుంచి పెద్ద మొత్తాల్నే వసూలు చేస్తున్నాయి. దీంతో హాలీవుడ్ సినిమాల అనువాదాలు ఒకదాని వెంట ఒకటిగా రిలీజవుతున్నాయి. గత ఏడాది బ్లాక్ పాంథర్, అవెంజర్స్ 2, యాంట్ మేన్ 2 వంటి భారీ చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. ఈ ఏడాది వరసగా పలు భారీ హాలీవుడ్ చిత్రాలు భారతదేశంలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
ఇందులో తొలిగా వస్తున్న సినిమా `కెప్టెన్ మార్వల్`. అన్నా బోడెన్ - ర్యాన్ ఫ్లెక్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కరోల్ డెన్వర్స్ (బ్రై లార్సన్) కెప్టెన్ మార్వల్ గా మారడం వెనక జరిగిన ప్రయాణమే ఈ సినిమా కథాంశం. మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. రిలీజ్ ముందే మీడియాకి ప్రత్యేకించి షోలు వేసి పాజిటివ్ సమీక్షల్ని పుల్ చేస్తుండడం ఆసక్తికరం. ఇప్పటికే బాలీవుడ్ లో ఈ సినిమా ప్రివ్యూని వీక్షించి ఆన్ లైన్ లో సమీక్షలు రాసేసారు. ఇక
తెలుగు వెర్షన్ ఈ శుక్రవారం రిలీజవుతోంది. రెండ్రోజుల ముందే.. అంటే నేటి(బుధవారం) సాయంత్రం తెలుగు మీడియాకి ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రివ్యూ షో వేస్తున్నారు. ఈ షోకి కెమెరాలు తేవొద్దని స్ట్రిక్టుగా ఆర్డర్ వేసింది ప్రచార బృందం.
లేడీ సూపర్ ఉమెన్ నటించిన ఈ సినిమా ఎలా ఉంది? అంటే ఫెంటాస్టిక్ అంటూ సమీక్షకులు అద్భుతమైన రివ్యూల్నే ఇచ్చారు. స్యామ్యుల్.ఎల్.జాక్సన్, బెన్ మెండెల్సన్, జూడ్ లా వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా కెప్టెన్ మార్వల్ పాత్రలో బ్రై లార్సెన్ పెర్ఫామెన్స్ వండర్ ఫుల్ అంటూ కితాబిచ్చేస్తున్నారు. ఎంసీయూ సంస్థలో మార్వలస్ పెర్ఫామెన్స్ అంటూ కితాబిచ్చేసారు. ఇటీవలే రిలీజైన తెలుగు ట్రైలర్ లో కథానాయిక యాక్షన్ విన్యాసాలు.. డేరింగ్ ఫీట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. భారీ విజువల్ గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. సూపర్ ఉమెన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి సంచలన విజయం సాధించిన `వండర్ ఉమెన్` రికార్డుల్ని ఈ చిత్రం బ్రేక్ చేస్తుందనే అంచనా వేస్తున్నారు.