Begin typing your search above and press return to search.
'కెప్టెన్' ట్రైలర్ టాక్ : మరో ప్రెడేటర్ స్టోరీ!
By: Tupaki Desk | 22 Aug 2022 8:54 AM GMTఆర్య తో ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో శక్తి సౌందర్ రాజన్ తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్ మూవీ 'టెడ్డీ'. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత హీరో ఆర్య, శక్తి సౌందర్ రాజన్ ల కలయికలో వస్తున్న మూవీ 'కెప్టెన్'. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్యా శెట్టి, గోకుల్ నాథ్ ఇతర పాత్రల్లో నటించారు. థింక్ స్టూడియోస్ తో కలిసి ది షో పీపుల్ బ్యానర్ లపై హీరో ఆర్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 8న ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో ఈ మూవీని హీరో నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని హీరో నితిన్ విడుదల చేశారు.
ఇందులో ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ విజయ్ కుమార్ పాత్రలో హీరో ఆర్య నటించారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది. అయితే హాలీవుడ్ ఫిల్మ్ ప్రెడేటర్ ఛాయాలు కనిపించడం గమనార్హం.
రెగ్యులర్ ఆర్మీ బేస్డ్ సినిమాలకు పూర్తి భిన్నంగా హాలీవుడ్ స్టాయిలో మేకింగ్ కనిపిస్తోంది. ఒక అడవిలో వింత జీవులను ఎదుర్కొవడానికి కెప్టెన్ విజయ్ కుమార్ అండ్ టీమ్ సహసోపేతంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఈ క్రమంలో వారికి ఎలాంటి సంఘనటలు ఎదురయ్యాయి?.. గ్రహాంతర వాసుల రహస్యాన్ని ఎలా చేధించారు?.. వారి నుంచి తమని తాము ఎలా కాపాడుకున్నారు? వఆరి ఆట ఎలా కట్టించారన్నదే ఈ చిత్ర ప్రధాన కథగా తెలుస్తోంది.
సైన్స్ ఫిక్షన్ గా ఈ మూవీని తెరకెక్కించారు. గతంలో ఇదే తరమాలో 'కమెండో' వంటి సినిమాలొచ్చాయి. మళ్లీ అదే తరహా కథ, కథనాలతో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఫొటోగ్రఫీ, యాక్షన్ సన్నివేశాలు, ప్రెడేటర్ లతో హీరో ఆర్య పోరాడే ఘట్టాలు ఆకట్టుకుంటున్నాయి. చాలా రోజుల తరువాత ప్రెడేటర్ లపై వస్తున్న ఈ మూవీ ఆకట్టుకోవడం గ్యారెంటీ అని ట్రైలర్ తో స్పష్టమవుతోంది.
మాళవికా అవినాష్, గోకుల్ ఆనంద్, భరత్ రాజ్, ఆదిత్య మీనన్, సురేష్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి వీఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ వి. అరుణ్ రాజ్, కాస్ట్యూమ్ డిజైనర్ దీపాలీ నూర్, స్టంట్ డైరెక్టర్ ఆర్. శక్తి శరవణన్, కె. గణేష్, ప్రొడక్షన్ డిజైనర్ ఎస్.ఎస్. మూర్తి, ఎడిటింగ్ ప్రదీప్ ఇ. రాఘవ్, సినిమాటోగ్రఫీ : ఎస్. యువ, సంగీతం డి. ఇమాన్, రచన, దర్శకత్వం శక్తి సౌందరరాజన్.