Begin typing your search above and press return to search.

ధ‌నుష్ పాన్ ఇండియా మూవీ స్టార్ట్‌

By:  Tupaki Desk   |   22 Sep 2022 12:30 PM GMT
ధ‌నుష్ పాన్ ఇండియా మూవీ స్టార్ట్‌
X
విభిన్న‌మైన సినిమాల‌తో హీరోగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుతో పాటు ప‌లు అవార్డుల్ని ద‌క్కించుకున్న ధ‌నుష్ సినిమాల ప‌రంగా స్పీడు పెంచేశాడు. తెలుగులో `సార్‌` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ధ‌నుష్ లేటెస్ట్ గా పీరియాడిక‌ల్ మూవీ `కెప్టెన్ మిల్ల‌ర్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అరుణ్ మాథేశ్వ‌ర‌న్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. 1930 - 1940 మ‌ధ్య కాలంలో జ‌రిగిన ప‌లు య‌ధార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

కీల‌క పాత్ర‌లో టాలీవుడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తున్నాడు. స‌త్య‌జ్యోతి ఫిలింస్ బ్యాన‌ర్ పై టి.జి. త్యాగ‌రాజ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, అర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ధ‌నుష్ కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహ‌న్ న‌టిస్తోంది. మ‌రో పాత్ర‌లో నివేదితా స‌తీష్ క‌నిపించ‌బోతోంది. గురువారం ఈ మూవీని పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభించారు. చెన్నైలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి హీరోలు ధ‌నుష్‌, సందీప్ కిష‌న్‌, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహ‌న్‌, నివేదితా స‌తీష్, చిత్ర బృందం హాజ‌ర‌య్యారు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ తో ఈ ప్రాజెక్ట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ధ‌నుష్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావండం.. పీరియాడిక‌ల్ మూవీ కావ‌డంతో `కెప్టెన్ మిల్ల‌ర్‌` మూవీని అంతా ప్ర‌త్యేకంగా చూస్తున్నారు. అఫీషియ‌ల్ లాంచింగ్ కి ముందే ఇందులో న‌టించే కీల‌క న‌టీన‌టుల‌ని ప‌రిచ‌యం చేయ‌డంతో ఈ ప్రాజెక్ట్ నెట్టింట మ‌రింత వైర‌ల్ గా మారింది. అంతే కాకుండా భారీ స్థాయిలో ధ‌నుష్ కెరీర్ లోనే అత్యంత భారీగా రూపొంద‌నున్న ఈ మూవీని త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

స‌రికొత్త నేప‌థ్యంలో వ‌స్తున్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న నేప‌థ్యంలో ధ‌నుష్ న‌టిస్తున్న పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా `కెప్టెన్ మిల్ల‌ర్` కూడా అదే స్థాయిలో ఆక‌ట్టుకునే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. ధ‌నుష్ న‌టించిన `తిరు` మూవీ రీసెంట్ గా వంద కోట్ల క్ల‌బ్ లో చేర‌డంతో `కెప్టెన్ మిల్ల‌ర్‌` పై మ‌రింత క్రేజ్ పెర‌గ‌డం ఖాయం అని చెబుతున్నారు.

ఇదిలా వుంటే బాహుబ‌లి ఫ్రాంచైజీ, RRR, పుష్ప వంటి లార్జ‌ర్ దెన్ లైఫ్ సినిమాల‌కు ప‌ని చేసిన మ‌ద‌న్ కార్కీ ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్ కు డైలాగ్ లు అందిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం జీవి ప్ర‌కాష్ కుమార్, సినిమాటోగ్ర‌ఫీ శ్రేయాస్ కృష్ణ‌, స్టంట్స్ దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌, ఎడిటింగ్ నాగూర‌న్‌.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.