Begin typing your search above and press return to search.
అదే నా జీవితాన్ని నాశనం చేసింది: హీరోయిన్
By: Tupaki Desk | 9 Jun 2020 11:10 AM GMTచేతిలో బోలెడు బాలీవుడ్ సినిమాలున్నాయి. తీరికలేని షెడ్యూల్. ఆ సినిమాలన్నీ విడుదలైతే స్టార్ హీరోయిన్ గా మారిపోతుంది. కానీ ఆ ఒక్క ప్రమాదం ఆమెను సినిమాలకే దూరం చేసింది. చీకట్లో పడేసింది. చావుతప్పి బతికిపడ్డ ఆ హీరోయిన్ ఇప్పుడు సినిమాలకే దూరమైన పరిస్థితి.
మహిమా చౌదరి.. బాలీవుడ్ హీరోయిన్ గా ప్రయాణం సాగించిన ఈమెను ఒక్క యాక్సిడెంట్ సినిమాల నుంచే పూర్తిగా బయటకు లాగేసింది. కాజోల్, అజయ్ దేవగణ్ ల సొంత నిర్మాణ సంస్థలతో తెరకెక్కుతున్న ‘దిల్ క్యాకరే’ చిత్రంలో నటిస్తున్న సమయంలో మహిమా చౌదరి పెద్ద యాక్సిడెంట్ కు గురయ్యారు. బెంగళూరులో షూటింగ్ కని కారులో వెళ్తుండగా.. ఆమె కారును ట్రక్కు గుద్దేసింది. బతకడం కష్టమనుకుందట ఆమె. ఎందుకంటే ముఖం నిండా కారు అద్దాలు గుచ్చుకున్నాయి.
డాక్టర్లు అతికష్టం మీద శస్త్రచికిత్స చేసి ఆమె ముఖం నుంచి ఏకంగా 67 గాజు ముక్కలను బయటకు తీశారు. ముఖం నిండా కుట్లు ఉన్నాయి. సూర్మరశ్మీ తగులకుండా లైట్ వెలుతురు లేకుండా చీకటి గదిలో తనను ఉంచారని ఆ యాక్సిడెంట్ తన కెరీర్ ను పూర్తిగా దెబ్బతీసిందని మహిమా చౌదరి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఆమె చేతిలోని సినిమాలన్నీ వేరే హీరోయిన్లకు పోయి వారంతా బాలీవుడ్ లో నిలదొక్కకోగా.. మహిమా చౌదరి మాత్రం ఆ యాక్సిడెంట్ తోనే సినిమా ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చింది.