Begin typing your search above and press return to search.
సాయిధరమ్ తేజ్ ని కాపాడిన వ్యక్తికి కారు బహుమతి.. నిజమెంత?
By: Tupaki Desk | 15 Sep 2021 10:30 AM GMTసుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ను కాపాడిన వ్యక్తి సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.. ప్రమాదం జరిగిన రాత్రి ఫర్హాన్ గచ్చిబౌలికి కేబుల్ బ్రిడ్జి మార్గంలో వెళ్లాడు. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఫర్హాన్ తక్షణ సహాయం కోసం 108, 100 కి డయల్ చేశాడు.
108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. సాయి తేజ్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. సాయి తేజ్‌కి చికిత్స అందించిన వైద్యులు హీరోని గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తీసుకువచ్చారని (ప్రమాదం జరిగిన గంటలోపే).. అతను ప్రమాదం నుండి బయటపడ్డాడని పేర్కొన్నారు.
ఫర్హాన్ సకాలంలో సహాయం గురించి తెలుసుకున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, ఇతర మెగా కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ ఛానెళ్లలో పవన్ ఫర్హాన్‌కి పవన్ 10 లక్షల రూపాయల నగదు బహుమతిగా అందించారని, రామ్ చరణ్ ఒక కారును బహుమతిగా ఇచ్చారని వార్తలు వచ్చాయి.
ఈ నివేదికలు వైరల్ కావడంతో ఫర్హాన్ బయటకు వచ్చి ఒక వివరణను ఇచ్చాడు. "నేను పవన్ కళ్యాణ్ లేదా మెగా కుటుంబ సభ్యుల నుంచి నగదు రివార్డ్ , కారును అందుకోలేదు. దయచేసి అలాంటి వార్తలను ప్రచారం చేయవద్దు ఎందుకంటే ఇది నా పని ప్రదేశంలో.. కుటుంబంలో కూడా నన్ను ఇబ్బంది పెడుతోంది” అని ఫర్హాన్ మీడియాకు విజ్ఞప్తి చేశాడు.
ఇక్కడితో ఆగకుండా ఫర్హాన్ ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.