Begin typing your search above and press return to search.
నయన్ సినిమాలో కారుకో కేరక్టర్
By: Tupaki Desk | 24 March 2016 6:14 AM GMTమాయ అంటూ గతేడాది వచ్చిన హారర్ మూవీ అందరినీ ఆకట్టుకుంది. హారర్ కామెడీ అంటూ.. హారర్ లో అవీ ఇవీ కలిపేసి పులగం చేసేస్తున్న టైంలో.. ఫక్తు హారర్ గా వచ్చిన నయనతార మూవీ మాయ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి అలాంటి సినిమాలోనే నయన్ మరోసారి కనిపించనుందని తెలుస్తోంది. మాయ విజయం కారణంగా.. ఇప్పుడు ఆమె మరుసటి చిత్రంపైనా హోప్స్ బాగా పెరిగాయి.
నయనతార నటిస్తున్న ఈ కొత్త హారర్ మూవీని దాస్ రామసామి దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. కనీసం ఎక్కడ చిత్రీకరిస్తున్నారనే వివరాలు కూడా తెలియనివ్వడం లేదు. అంతా సీక్రెట్ గా షూటింగ్ జరిగిపోతోంది. అయితే ఎలాగోలా కష్టపడి సంపాదించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే.. ఈ మూవీలో కారు చాలా కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఈ కారుపై అనేక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే కేరక్టర్లతో సమానంగా ఈ కారును కూడా చూసుకుంటున్నారు. షూటింగ్ లో భాగం చేస్తున్నారు. ఇదో డిఫరెంట్ హారర్ మూవీ అని.. భయపెట్టేందుకు కొత్త ఎలిమెంట్స్ వస్తాయని తెలుస్తోంది.
ఇదంతా వింటుంటే సినిమాలా ఆ కారే దెయ్యమైనా అయుండాలి లేదా., దానిలో ప్రయాణం అంటే ఇక మరణించడమే అనేలా ఉండాలి. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సర్కుణం నిర్మాతగా ఉండనుండగా,,, నటుడు తంబిరామయ్య నయనతారకు తండ్రిగా నటిస్తున్నాడు.