Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ లో కంచరపాలెం హవా

By:  Tupaki Desk   |   10 Sept 2018 11:16 AM IST
ఓవర్సీస్ లో కంచరపాలెం హవా
X
C/o కంచరపాలెం'.. ఇప్పుడు అందరినోళ్ళలో నానుతున్న సినిమా ఇది. నూతన దర్శకుడు కొత్తవారితో వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ రియలిస్టిక్ ఫీల్ ఉన్న మూవీ క్రిటిక్స్ ను రివ్యూయర్స్ ను బౌల్డ్ చేసింది. ఇక ఆడియన్స్ రెస్పాన్స్ కూడా రోజూ పెరుగుతూ ఉంది. ఇక సెలెబ్రిటీలు కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తుండడంతో సినిమా సూపర్ హిట్ అయ్యే దిశగా పయనిస్తోంది.

ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా తన సత్తా చాటింది. తొలి వారంతంలో $185K కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సాధారణంగా ఈ ఫిగర్ చిన్నదేగానీ సినిమా బడ్జెట్.. స్టార్ అట్రాక్షన్స్ లేకపోవడం వంటి కారణాలు మనం లెక్కలోకి తీసుకుంటే ఇది పెద్ద కలెక్షనే. శుక్రవారం $55,396 - శనివారం $85,505 - ఆదివారం నాడు షుమారుగా $35K కలెక్షన్స్ తో ఈ సినిమా అమెరికాలో సత్తా చాటింది.

మరో వైపు 'C/o కంచరపాలెం' తో పాటు రిలీజ్ అయిన 'మను' ప్రోమోస్ ద్వారా ఆసక్తి రేకెత్తించినప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం ఆ ఊపు కనిపించలేదు. శుక్రవారం $18,306 - శనివారం: $12,454 ఆదివారం $4K కలెక్షన్స్ సాధించింది. టోటల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ $35K.

ఇక శుక్రవారం విడుదలయిన మరో సినిమా 'సిల్లీ ఫెలోస్'. అల్లరి నరేష్ - సునీల్ లాంటి క్రౌడ్ పుల్లర్స్ ఉన్నప్పటికీ సినిమాలో విషయం లేకపోవడంతో మొదటి వీకెండ్ అంతటికీ $8k కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే 'గీత గోవిందం' ఈ వారాంతం లో $35K కలెక్షన్స్ తో తన జోరును కొనసాగించింది.