Begin typing your search above and press return to search.
తమిళ, మలయాళంకు మన కంచరపాలెం
By: Tupaki Desk | 28 May 2019 10:17 AM GMTగత ఏడాది చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేరాఫ్ కంచరపాలెం అందరి దృష్టిని ఆకర్షించింది. రానా ఈ చిత్రంకు నిర్మాతగా వ్యవహరించడంతో అందరు కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపించారు. పెళ్లి చూపులు స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని భావించారు. కాని కేరాఫ్ కంచరపాలెంకు ఆశించిన స్థాయిలో ఆధరణ దక్కలేదు. కమర్షియల్ గా కూడా ఎక్కువగా రాబట్టలేక పోయింది. విభిన్నమైన కథ.. కథనంతో తెరకెక్కిన 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రం విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కించుకుంది.
తెలుగులో కమర్షియల్ గా అలరించలేక పోయిన 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రంను తమిళం మరియు మలయాళంలో రీమేక్ చేసేందుకు నిర్మాత రాజశేఖర్ రెడ్డి. యమ్ ఏర్పాట్లు చేస్తున్నాడు. రేపు ఆయన పుట్టిన రోజు సందర్బంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేశాడు. సినిమా చూడగానే వెంటనే సురేష్ బాబు గారి వద్దకు వెళ్లి రీమేక్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం తమిళ రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయ్యిందని.. మరో వైపు మలయాళం రీమేక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని చెప్పుకొచ్చాడు.
తమిళం మరియు మలయాళంలో ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం నాకుందని.. మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో పుట్టిన రోజు సందర్బంగా ఈ చిత్రంను ప్రకటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. పలు సినిమాలను అందించిన ఈయన కేరాఫ్ కంచరపాలెంతో అభిరుచి కలిగిన నిర్మాత అనే పేరు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తెలుగులో అంతగా ఆకట్టుకోలేక పోయిన మన కంచరపాలెం అక్కడ ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.