Begin typing your search above and press return to search.

క్రేజు కంటే కెరీర్ ముఖ్యం రౌడీగారు!

By:  Tupaki Desk   |   14 Nov 2019 7:10 AM GMT
క్రేజు కంటే కెరీర్ ముఖ్యం రౌడీగారు!
X
గ‌త కొంత‌కాలంగా రౌడీ గారి వాల‌కం చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది. అత‌డు అనుస‌రిస్తున్న ఫ్యాష‌న్స్ కానీ వ‌స్త్ర‌ధార‌ణ వ్య‌వ‌హారం కానీ కోరుకుంటున్న ప్ర‌చారం కానీ.. ప్ర‌తిదీ కొత్త‌గా ట్రై చేస్తున్న మాట నిజ‌మే కానీ.. అది తెలుగు యువ‌త‌కు ఎంత‌గా క‌నెక్ట‌య్యింది అన్న‌ది ఓ డౌట్. మ‌రోవైపు ప్ర‌ముఖ బాలీవుడ్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ల‌ను హైర్ చేసుకుని మ‌రీ కొత్త కొత్త ఫోటోషూట్ల‌తో ప్ర‌యోగాల‌కు దిగుతున్నాడు రౌడీ విజ‌య్. కొన్ని మెప్పిస్తే కొన్ని ట్రోలింగుకి దారి తీస్తున్నాయి.

అయితే విజ‌య్ ఎందుకిలా చేస్తున్నాడు? అంటే కేవ‌లం లోక‌ల్ మార్కెట్ కే ప‌రిమితం అయిపోకుండా పాన్ ఇండియా మార్కెట్ పై ఫోక‌స్ చేయ‌డ‌మే అందుకు కార‌ణం అని మాట్లాడుకున్నారు. తెలుగు మార్కెట్ ఒక్క‌టే అన్న‌ది పాత మాట‌. ఇప్పుడు త‌న ట్యాలెంటుకు త‌గ్గ‌ట్టు హిందీ మార్కెట్ కావాల‌న్న‌ది విజ‌య్ ఆలోచ‌న‌. అందుకు త‌గ్గ‌ట్టే త‌ను ప‌దిమందికీ ఆద‌ర్శంగా నిల‌వాల‌న్న‌ది ప్లాన్. ఆ దిశ‌గా చేసిన ప్ర‌య‌త్నాలేమిటో చూస్తూనే ఉన్నాం. ఇంత‌కుముందు క‌ర‌ణ్ జోహార్- మ‌నీష్ మల్హోత్రా లాంటి ప్ర‌ముఖుల్ని క‌ల‌వ‌డం వెన‌క కార‌ణం అంద‌రూ ఊహించారు.

అర్జున్ రెడ్డి హిందీ లో క‌బీర్ సింగ్ పేరుతో రీమేకై సంచ‌ల‌న విజ‌యం సాధించాక ఒరిజిన‌ల్ మూవీ అర్జున్ రెడ్డికి మ‌రింత క్రేజు పెరిగింది. ఆ క్ర‌మంలోనే దేవ‌ర‌కొండ పేరు హిందీనాట మార్మోగింది. అయితే ఇప్ప‌టికే ఇంత క్రేజు ఉన్నా అత‌డు ఇంకా ఏదో కావాలని కోరుకుంటున్నాడు. త‌న‌కు ద‌క్కాల్సినది ఇంకా ఏదో ఉంద‌ని త‌పిస్తున్నాడు. అందుకే ఇటీవ‌ల మాట్లాడితే ముంబైలో క‌నిపిస్తున్నాడు. తాజాగా ఓ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ల‌తో క‌లిసి క‌నిపించాడు. మ‌నోజ్ భాజ్ పాయ్ లాంటి సీనియ‌ర్ తో చెట్టా ప‌ట్టాల్ అంటూ భుజం రాసుకుంటూ క‌నిపించాడు. దీపిక‌-ఆలియా-ర‌ణ‌వీర్ వంటి స్టార్లు ఉన్నారు అక్క‌డ‌. వీళ్ల‌తో పాటే త‌మిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి సంద‌డి చేశారు. ఇక ఈ షోకి అనుప‌మ్ చోప్రా హోస్ట్. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ అవుతుంటే అభిమానుల్లో ర‌క‌ర‌కాల సందేహాలు నెల‌కొన్నాయి.

విజ‌య్ కి ఇప్ప‌టికే బోలెడంత క్రేజు ఉంది క‌దా.. కొత్త‌గా అత‌డికి ప్ర‌మోష‌న్ ఎందుకు? ముందు సినిమాల‌పై దృష్టి సారిస్తే బావుంటుంది కానీ! అంటూ సందేహించారు. హీరోగా న‌టించిన గ‌త చిత్రం యావ‌రేజ్. నిర్మాత‌గా మారి తెర‌కెక్కించిన తొలి సినిమా ఫ్లాప్. అందుకే ఇప్పుడు వ‌రుస హిట్లు అవ‌స‌రం. హిట్టు మీద హిట్టు కొడితేనే కెరీర్ దారిలోకొస్తుంది. ఇలాంటి టైములో దూర‌పు కొండ‌ల‌పై కొత్త మోజు ఎందుకు? కొత్త క్రేజు కోసం పాకులాట ఎందుకు? అంటూ సందేహిస్తున్నారు కొంద‌రు. హిట్టు బంప‌ర్ హిట్టు లేక‌పోతే ఏదీ లేదు. అన్నీ జీరోనే. మ‌రి విజ‌య్ ఏం చేయ‌బోతున్నాడో చూడాలి