Begin typing your search above and press return to search.
సినిమాలో వేధింపులు.. రియల్ లైఫ్ లో పిటిషన్
By: Tupaki Desk | 24 Sep 2016 5:30 PM GMT'జనాలపై సినిమాల ప్రభావం ఎంతుందో కానీ.. పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది' అంటూ ఆగడు మూవీలో మహేష్ బాబు ఓ డైలాగ్ చెబుతాడు. పంచ్ డైలాగ్స్ పై పంచ్ వేయడానికి ఆ డైలాగ్ చెబుతాడు కానీ.. సినిమాలు మరో యాంగిల్ లో కూడా సమాజంపై ప్రభావం చూపుతున్నాయంటూ.. ఇప్పుడో పిటిషన్ దాఖలైంది.
హీరోలు హీరోయిన్ల వెంటబడ్డం.. వేధించడం.. దాన్నే ప్రేమ అనడం చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. నాన్నకు ప్రేమతో చిత్రంలో రకుల్ వెంట పడతాడు ఎన్టీఆర్. ఫాలో ఫాలో యూ అంటూ ఓ పాట కూడా వేసుకుంటాడు. తమిళ్ లో 3.. హిందీలో రాన్ ఝానా వంటి సినిమాల్లోనూ.. రీసెంట్ గా శ్రీరస్తు శుభమస్తు మూవీలోనూ ఇలాంటి సీన్స్ నే చూశాం. ఇదంతా చూస్తే అమ్మాయిలను ప్రేమించడంలో బాగంగా వేధిస్తే పెద్ద తప్పేం కాదన్నట్లుగా ఉంటుంది సినిమాల వాలకం. కానీ రియల్ లైఫ్ లో ఇలాంటి పనులు చేస్తే జైల్లో పడేసి ఉతుకుతారనే విషయం తెలిసిందే.
దీనిపై చెన్నైకి చెందిన ఓ రీసెర్చ్ స్కాలర్ ఐశ్వర్య.. ఇలాంటి సీన్స్ నిషేధించాలంటూ కోర్టులో కేసు వేసింది. సినిమాల్లో చెడుతో పాటు మంచిని కూడా చూపిస్తామని.. దాన్ని రిసీవ్ చేసుకోవడంలో తేడాలుంటాయి తప్ప.. సినిమాల్లో తప్పులుండవంటున్నారు మూవీ మేకర్స్. కొన్ని సీన్లు నిషేధించిన మాత్రాన వాస్తవ జీవితంలో మార్పులు వస్తాయనే వాదనను ఖండిస్తున్నారు. మరీ ఈ పిటిషన్ పై కోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో అనే ఆసక్తి కనిపిస్తోంది.