Begin typing your search above and press return to search.
నిర్మాత పరారీకి సాయం చేసిన నటుడిపై కేసు
By: Tupaki Desk | 1 Jun 2018 4:37 AM GMTరీల్ హీరో రియల్ విలన్ అయ్యాడా? పోలీసుల విధి నిర్వహణకు అడ్డు తగిలారా? ప‌్రముఖ నటుడి తీరు ఇప్పుడు ప్రశ్నలు రేగేలా చేయటమే కాదు.. ఆయన తీరుపై పోలీసులు కేసు నమోదు చేయటం సంచలనంగా మారింది. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు శాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఒక నిర్మాత మీద ఉన్న కేసులో ఆయన్ను అరెస్ట్ చేయటానికి వచ్చిన పోలీసుల్ని బురిడీ కొట్టించి.. సదరు నిర్మాత పరారీ అయ్యేందుకు సాయం చేశారన్న ఆరోపణల్ని ఆ నటుడు ఎదుర్కొంటున్నాడు.
కేసులో చిక్కుకున్న నిర్మాతను అరెస్ట్ చేయటానికి పోలీసులు వస్తే.. ఆయన్ను తప్పించేందుకు ప్రముఖ నటుడు తప్పు చేయటం ఏమిటి? ఎందుకిలా జరిగింది? అన్నది చూస్తే..కన్నడ హీరో దునియా విజయ్ పేరున్న నటుడు. కన్నడ ప్రజలు ఆయన్ను అభిమానిస్తారు. విజయ్ బ్యాక్ గ్రౌండ్‌లోకి వెళితే ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ ఎంట్రీ ఇచ్చిన ఇతగాడి సుడి 2007లో రిలీజ్ అయిన దునియా మూవీతో మారిపోయింది. అప్పటివరకూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న అతగాడు.. హీరో అయిపోయాడు.
పేరుకు ముందు సూపర్ హిట్ మూవీ దునియా వచ్చి చేరింది. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఛాన్సుల మీద ఛాన్సులు వచ్చాయి. ప్రముఖ హీరోల్లో అతగాడి పేరు వినిపిస్తూ ఉంటుంది. మరి.. ఇలాంటి ప్రముఖ నటుడి మీద కేసు నమోదు కావటం ఏమిటన్న సందేహం అక్కర్లేదు. దీనికి బలమైన కారణం లేకపోలేదు.
2016లో దునియా విజయ్ హీరోగా సుందర్ గౌడ్ నిర్మాత మాస్తిగుడి సినిమాను నిర్మించారు. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా తిప్పగొండనహళ్లి జలాశయం దగ్గర షూటింగ్ జరుపుగుతున్న సమయంలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ సినిమాలో విలన్లుగా నటించిన ఉదయ్.. అనిల్ ఇద్దరు హెలీకాఫ్టర్ ను జలాశయంలోకి దూకే సన్నివేశంలో ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. దీంతో నిర్మాత మీద కేసు నమోదైంది. ఈ కేసు విచారణ ఇప్పటివరకూ సాగి.. ఇద్దరు నటుల మృతికి కారణమైన నిర్మాతను అరెస్ట్ చేసేందుకు బెంగళూరు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు.
నిర్మాతకు సాయం చేసేందుకు.. దునియా విజయ్ ఆయన ఇంటి వద్దకు వెళ్లి.. తనకున్న పేరు ప్రఖ్యాతులతో పోలీసులతో మాట్లాడుతూ.. నిర్మాత పరారీ అయ్యేందుకు సహకరించారని చెబుతున్నారు.
రియల్ లైఫ్ లో నిందితుడికి సాయం చేసేందుకు ప్రయత్నించిన రీల్ హీరో విజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సాయం చేసే ముందు చట్టబద్ధమైనదా? కాదా? అన్నది చెక్ చేసుకోకుండా ఇలా సాయం చేయటం ఏమిటంటూ పలువురు తప్పు పడుతున్నారు. ఊహించని రీతిలో కేసులో బుక్ అయిన దునియా విజయ్ వ్యవహారం ఇప్పుడు శాండిల్ వుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.