Begin typing your search above and press return to search.
పుణ్యానికి పోయి చిక్కుల్లో పడ్డ అమిర్?
By: Tupaki Desk | 22 Feb 2017 1:23 PM GMTపుణ్యానికి పోతే అదేదో అయ్యిందన్నట్లుగా మారింది బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ పరిస్థితి. ఒక స్వచ్చంద సంస్థతో కలిసి.. ప్రజల్ని చైతన్యపరిచేందుకు ఉద్దేశించిన ప్రకటన ఇప్పుడాయన మెడకు చుట్టుకున్నట్లైంది. నగర సమస్యల్ని పేర్కొంటూ.. ముంబయి ప్రజలారా తప్పనిసరిగా ఓటు వేయండంటూ అమిర్ పిలుపునిచ్చారు. ఇదేం తప్పే కాదే.. ఎన్నికల వేళ ప్రజల్లో చైతన్యం కలిగే మాట చెబితే కూడా తప్పేనా? అంటే అవుననే చెబుతున్నారు. ఎందుకంటే.. సదరు ప్రకటన జారీ చేసిన స్వచ్చంద సంస్థ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు తెలిసిన వారిది కావటమే కారణం.
ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే..ఈ ప్రకటన బీజేపీ వర్గాలకు చెందిదన్నది విపక్షాల ఆరోపణ. పోలింగ్ వేళ.. ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రకటనలు జారీ చేయటం సరికాదు. అధికారపార్టీకి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్న ఈ ప్రకటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. అమిర్ నటించిన ఈ ప్రకటన ఫస్ట్ ఆర్గనైజేషన్ అనే సంస్థకు చెందిందని.. ఇది మహారాష్ట్ర సీఎంకు తెలిసిన వారిదని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఆంక్షలు ఉన్న వేళలో విడుదలైన ఈ ప్రకటన ఎన్నికల కమిషన్ నియమాలను ఉల్లంఘించేలా ఉందన్న మాట వినిపిస్తోంది. మరాఠీ పత్రికల్లో ప్రచురితమైన ఈ ప్రకటనను ఓటర్లను ప్రభావితం చేసే పనిలో భాగంగానే చేశారని కాంగ్రెస్ ఆరోఫిస్తోంది. అంతేకాదు.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని ఈసీని కోరనుంది. మరీ.. విషయాలన్నీ అమిర్ తెలిసే చేశారా? లేదా? అన్నది ఈసీ విచారణలో తేలనుందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/