Begin typing your search above and press return to search.

ఇళయరాజా రాయల్టీ ఎపిసోడ్.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్

By:  Tupaki Desk   |   24 Dec 2018 5:38 AM GMT
ఇళయరాజా రాయల్టీ ఎపిసోడ్.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్
X
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలను ఎవరైనా లైవ్ కాన్సర్టులలో వాడితే అయనకు రాయల్టీ చెల్లించాలని చాలా రోజుల నుండి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అలా అందరిదగ్గరా రాయల్టీ వసూలు చేస్తున్నాడు. రాయల్టీ చెల్లించకుండా తన పాటలు వాడిన వారికి లీగల్ నోటీసులు కూడా పంపించాడు. ఇళయరాజా నోటీసులు అందుకున్న వారిలో ఇళయరాజా స్నేహితుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఉన్నాడు.

ఇదిలా ఉంటే ఇళయరాజా ఎపిసోడ్ లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చింది. ఆరుమంది తమిళ నిర్మాతలు మద్రాసు హైకోర్టులో ఇళయరాజాకు వ్యతిరేకంగా ఒక పిటీషన్ ఫైల్ చేశారు. ఈ నిర్మాతల వాదన ఇలా ఉంది.. పాటలకు రాయల్టీ వసూలు చేసే హక్కు ఇళయరాజా కు లేదు. ఎందుకంటే సినిమాలోని పాటల పై (ఆడియో.. విజువల్స్) సర్వహక్కులు తమకే (నిర్మాతలకే) ఉంటాయని అంటున్నారు. అలాంటప్పుడు ఇళయరాజా ఆ పాటల పై రాయల్టీ ఎలా వసూలు చేస్తాడని ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయం పై ఇంకా ఇళయరాజా స్పందించలేదు. మరోవైపు కోర్టువారు కూడా ఎలాంటి తీర్పు ఇస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యాయనిపుణులు మాత్రం ఇది చాలా కాంప్లికేటేడ్ అంశమని నిజానికి ఈ పాటల పై హక్కు నిర్మాతలకు కూడా పూర్తిగా ఉండదని.. ఎందుకంటే ఆడియో రైట్స్ ను మ్యూజిక్ కంపెనీలకు అమ్మేసి ఉంటారు కాబట్టి ఆడియో రైట్స్ వారికి చెందవని.. విజువల్స్ పై మాత్రం రైట్స్ ఉంటాయని అంటున్నారు. అంటే .. ఈ ఎపిసోడ్లోకి ఇప్పుడు మ్యూజిక్ కంపెనీల వారు కూడా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.