Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ దర్శకుడు అరెస్ట్ కావాల్సిందేనా?
By: Tupaki Desk | 15 Jun 2019 6:32 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక్క సినిమా చేసే అవకాశం రావడమే చాలా గొప్ప విషయంగా భావిస్తారు. కాని రజినీకాంత్ ను బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం యంగ్ డైరెక్టర్ రంజిత్ పా కు దక్కింది. తమిళ యంగ్ డైరెక్టర్స్ లో రంజిత్ పా ముఖ్యడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విభిన్నమైన కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తూ ఉండే రంజిత్ పా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నాడు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
తమిళ జనాల్లో ఎక్కువ శాతం మంది చోళ చక్రవర్తి అయిన రాజ రాజ చోళుడు గొప్ప వ్యక్తిగా దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు. ఆయన పరిపాలనను స్వర్ణ యుగంగా అభివర్ణిస్తారు. కాని ఆయన గురించి దర్శకుడు రంజిత్ పా తాజాగా తంజావూరు జిల్లాలో ఏర్పాటు చేసిన దళిత సభలో నెగటివ్ గా మాట్లాడాడు. రాజ రాజ చోళుడు అందరు అనుకున్నట్లుగా మంచి వాడు కాదని చరిత్రను కాస్త లోతుగా అధ్యయనం చేస్తే అతడి గురించిన విషయాలు వెళ్లడవుతాయని రంజిత్ పా అన్నాడు.
రాజ రాజ చోళుడి పాలనలో తక్కువ కులాల వారి భూములను లాక్కున్నాడు. దాదాపు 400 మందిని దేవదాసీలుగా మార్చిన చీకటి ఘనత ఆయనది. ఆయన పాలనలో చీకటి కోణాలు చాలా ఉన్నాయి. కాని కొందరు మాత్రం వెలుగునే చూపించి ప్రచారం చేయడం జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రంజిత్ పా వ్యాఖ్యలపై తమిళ హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పలు కేసులు రంజిత్ పా పై నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో రంజిత్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు తిరష్కరించింది.
పోలీసులు రంజిత్ పా ను పిలిపించి తన వ్యాఖ్యలపై వివరణ అడగనున్నారు. వివరణతో సంతృప్తి చెందుకుంటే అరెస్ట్ చేస్తారనే టాక్ తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. గతంలో కూడా రంజిత్ పా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు.