Begin typing your search above and press return to search.
శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై చీటింగ్ కేసు
By: Tupaki Desk | 10 Aug 2021 4:41 AM GMTబాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టికి కష్టాలు తీరేలా కనిపించడం లేదు. అశ్లీల వీడియోల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భర్త అరెస్ట్ తో కృంగిపోయిన శిల్పాశెట్టికి తాజాగా మరో కేసు మెడకు చుట్టుకుంది.
తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై లక్నోలోని పోలీస్ స్టేషన్ లలో చీటింగ్ కేసు నమోదైంది. శిల్పా శెట్టి, ఆమె తల్లి తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ హజరత్ గంజ్, విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు.
కాగా ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్ సుమన్ అధికారిగా ఉన్నారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీ, ఒక బృందం ముంబైకి చేరుకుంది. డీసీపీ సంజీవ్ సుమన్ మాట్లాడుతూ ‘ఈ విషయం ఉన్నత స్థాయికి చేరిందని.. అందువల్ల పోలీసులు అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారని ’ ఆయన తెలిపారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. శిల్పాశెట్టి అయోసిస్ వెల్ నెస్ అండ్ స్పా పేరుతో ఫిట్ నెస్ సెంటర్ ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆమె చైర్మన్ గా ఉండగా.. ఆమె తల్లి సునంద డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిట్ నెస్ సెంటర్ మరో బ్రాంచ్ ను లక్నోలో ప్రారంభించేందుకు జోత్స్య చౌహార్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరికి వారు ఫ్రాంచైజీ ఇచ్చి సెంటర్ ను ప్రారంభించేందుకు వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై శిల్పా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో శిల్పా, ఆమె తల్లి సునందలు తమ వద్ద డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.