Begin typing your search above and press return to search.

సెంటిమెంట్స్ పై దెబ్బ కొట్టిన జాక్వెలిన్

By:  Tupaki Desk   |   19 Jun 2016 12:57 PM IST
సెంటిమెంట్స్ పై దెబ్బ కొట్టిన జాక్వెలిన్
X
వివాదంతో పబ్లిసిటీ చేసుకోవడం.. మూవీ మేకర్స్ కు అలవాటయిపోయింది. సరిగ్గా రిలీజ్ కి ముందే ఏదో ఒక గొడవని సృష్టించగలగితే., సగం పబ్లిసిటీ అయిపోయినట్లే. వచ్చే నెల చివరివారంలో విడుదల కానున్న యాక్షన్ మూవీ డిషూంపై.. ఇప్పుడు వివాదం బాగానే రాజుకుంది.

ఓ ఐటెం సాంగ్ లో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ధరించిన వస్తువులే గొడవకు మెయిన్ రీజన్. సిక్కులు పవిత్రంగా భావించే కిర్పాణ్ ను... జాక్వెలిన్ తో అభ్యతరకరంగా ఉపయోగించారని అంటున్నారు. జాక్వెలిన్ నడుముకు కట్టిన కిర్పాణ్.. స్పష్టంగానే కనిపిస్తోంది. సిక్కుల మనోభావాలు దెబ్బతీశారన్నది డిషూంపై ఆరోపణ. అయితే.. ఇది కిర్పాణ్ కాదని.. మెక్సికన్ డాగర్ అంటున్నాడు నిర్మాత కం హీరో.

దీనిపై ఇంకా స్పష్టత రాలేదు కానీ.. చండీఘడ్ లో మాత్రం ఓ కేసు నమోదైంది. హీరోయిన్ జాక్వెలిన్ తో పాటు.. నిర్మాత సాజిద్ నడియద్వాలాపై కూడా ఫిర్యాదు అందింది. ఐపీసీ సెక్షన్ 295ఏ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తునకు రెడీ అవుతున్నారు. ఇది నిజంగానే కిర్పాణ్ కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు డిషూం డైరెక్టర్ పై పడింది.