Begin typing your search above and press return to search.
`పుష్ప` ప్రీరిలీజ్ ఈవెంట్ పై కేసు.. కారణం ఇదే
By: Tupaki Desk | 13 Dec 2021 10:35 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం `పుష్ప : ది రైజ్`. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు బాగాలుగా రవిడుదల చేయనున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం తాజాగా ప్రమోషన్స్ ని స్పీడప్ చేసేసింది. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈవెంట్ పై సీరియస్ అయిన పోలీసులు షాకిచ్చారు.
మేనేజర్లకు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ పోలీసులు మేనేజర్లపై మండిపడుతున్నారు. కేవలం 5000 పాస్ లకు మాత్రమే అనుమతి తీసుకుని ఎక్కువ పాస్ లు జారీ చేశారని నిర్ధారించుకున్న పోలీసులు శ్రేయాస్ మీడియాతో పాటు ఈవెంట్ ఆర్గనైజేషన్ పై ఐపీసీ సెక్షన్ 143, 341, 336, 290 కింద కేసులు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 12 ఆదివారం `పుష్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అట్ట హాసంగా భారీ స్థాయిలో నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆదివారం ఉదయం నుంచే యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ కు భారీగా తరలి వచ్చారు. వేల సంఖ్యలో అనుకున్న దానికి మించి రావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతే కాకుండా ఓ దశలో తొక్కిసలాట జరిగింది. అయితే అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కావడాన్ని గమనించిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ వారు అభిమానుల్ని అదుపు చేయడానికి ప్రయత్నించారట.
కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అసలు ఈవెంట్ కి ఎంత మంది అభిమానులు వచ్చారు? .. ఎంత మంది వస్తారని అనుమతులు తీసుకున్నారనే అంశాన్ని పరిశీలిస్తే అసలు విషయం బయటపడిందట. దీంతో ఈవెంట్ మేనేజర్లపై పోలీసులు సీరియస్ అయి కేసులు నమోదు చేసినట్టుగా తెలిసింది.