Begin typing your search above and press return to search.

రద్దీ రోడ్ పై ‘డర్టీ హరీ’ హాఫ్ న్యూ డ్ పోస్టర్.. సినీ నిర్మాతపై కేసు

By:  Tupaki Desk   |   14 Dec 2020 11:50 AM GMT
రద్దీ రోడ్ పై ‘డర్టీ హరీ’ హాఫ్ న్యూ డ్ పోస్టర్.. సినీ నిర్మాతపై కేసు
X
సినీ ఇండస్ట్రీలో కొత్త కథలు రావడం లేదు. వచ్చేవన్నీ కంటెంట్ తక్కువవుతోంది.. బోల్డ్ ఎక్కువ అవుతోంది. బోల్డ్ అడల్ట్ కంటెంట్ తో సినిమాలన్నీ కుమ్మేస్తున్నారు. చివరకు రాంగోపాల్ వర్మ సైతం బూతునే నమ్ముకున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని పలువురు సెటైర్లు పేలుస్తున్నారు.

ఆ మధ్యకాలంలో టాలీవుడ్ లో భారీ క్లాసిక్ హిట్ మూవీలు తీసిన నిర్మాతల్లో ఎంఎస్ రాజు ఒకరు. అయితే కొన్ని సినిమాల నష్టంతో ఆయన తేరుకోలేకపోయారు. తాజాగా బోల్డ్ కంటెంట్ తో ‘డర్టీ హరి’ సినిమాను ఎంఎస్ రాజు దర్శకత్వంలో తీస్తున్నారు. ఈనెల 18న ‘డర్టీ హరి’ అనే చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. విడుదలకు ముందే ఈ సినిమా వివాదాలకు కారణమైంది.

యూసఫ్ గూడ నుంచి జూబ్లీహిల్స్‌ వైపు వెళ్లే మార్గంలో ఉన్న మెట్రో పిల్లర్‌పై డర్టీహరీ పోస్టర్‌ను అతికించారు. ఇది వెంకటగిరి పరిధిలోకి వస్తుంది. ఈ పోస్టర్‌ అసభ్యకరంగా ఉంది. హీరో హీరోయిన్లు అర్థనగ్నంగా ఉన్న పోస్టర్‌ను అక్కడ అంటించారని ఇది చాలా ఇబ్బందికరంగా ఉందంటూ వెంకటగిరి నివాసితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

స్త్రీ గౌరవాన్ని అవమానించేలా.. యువతను తప్పుదోవ పట్టించే రీతిలో ‘డర్టీ హరి’ సినిమా పోస్టర్లు ఉన్నాయని ఆ సినీ నిర్మాత శివరామకృష్ణతోపాటు పబ్లిషింగ్ ఏజెన్సీలపై సుమోటో కేసును జూబ్లీ హిల్స్ పోలీసులు నమోదు చేశారు.

డర్టీ హరి సినిమా మొత్తం బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతోంది. ఇందులో శ్రవణ్ రెడ్డి, రుహని శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఒకప్పటి టాప్ నిర్మాత అయిన ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు.