Begin typing your search above and press return to search.
ప్రముఖ దర్శకుడు భారతీరాజాపై కేసు
By: Tupaki Desk | 23 Jun 2018 4:41 AM GMTసీనియర్ దర్శకుడు భారతీ రాజా చిక్కుల్లో పడ్డారు. ఎంతో మంది టాప్ హీరోలను, హీరోయిన్లను తెరకు పరిచయం చేసిన ఆయనంటే తమిళ ఇండస్ట్రీలో ఎంతో పేరుంది. ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకునే భారతీరాజా తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదైంది.
భారతీరాజా ఈ మధ్య మత ఉద్రిక్తతలు - అల్లర్లు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడారు. హిందువులు అత్యధికంగా పూజించే వినాయకుడు దిగుమతి చేసుకున్న దేవుడు అంటూ వ్యాఖ్యానించి దుమారం రేపారు. ఈ వ్యాఖ్యలు హిందువులు మనోభావాలలను కించపరిచేలా ఉన్నాయని హిందూ మక్కల్ మున్నాని సంస్థ ఫిర్యాదు చేసింది.
దీంతో 76 ఏళ్ల భారతీరాజాపై చెన్నైలో కేసు నమోదైంది. భారతీరాజా పై గతంలోనూ ఇదే తరహా కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేయకుండా మద్రాస్ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు మరోసారి కేసు నమోదు కావడంతో చిక్కుల్లో పడ్డారు.