Begin typing your search above and press return to search.

వీడియో సాంగ్: క్యాస్ట్ చెప్పుకుంటే తప్పేంటి

By:  Tupaki Desk   |   27 Aug 2019 6:47 AM GMT
వీడియో సాంగ్: క్యాస్ట్ చెప్పుకుంటే తప్పేంటి
X
వివాదం లేని కంటెంట్ లేనిదే సినిమా తీయని రామ్ గోపాల్ వర్మ కొత్త ప్రయత్నం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ ఈసారి కూడా ఏదో కాంట్రావర్సి కాన్సెప్ట్ తో వస్తున్నాడన్న విమర్శలు టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే వచ్చాయి. దానికి తగ్గట్టే పబ్లిసిటీని మొదలుపెట్టేశాడు వర్మ. అందులో భాగంగా క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ ని రిలీజ్ చేశాడు. సిరాశ్రీ సాహిత్యం సమకూర్చగా రవికాంత్ స్వరకల్పనలో వర్మ స్వయంగా ఇది పాడటం విశేషం. గాయకుడిగా తనేం మనకు కొత్త కాదు కానీ ఇది ఏకంగా 7 నిమిషాల పాటు సాగే గీతం కావడమే ట్విస్ట్.

నా దేశం నా కుటుంబం నా స్నేహితులు అని చెప్పుకోవడం తప్పు కానప్పుడు నా కులం అని ఎందుకు చెప్పకూడదు అని వర్మ ప్రశ్నించడంతో పాట మొదలవుతుంది. సాంగ్ మొత్తం ఇదే ధోరణిలో ప్రశ్నార్థకాలతో సాగుతుంది. హిపోక్రసీ పేరిట మీడియాతో పాటు రాజకీయ నాయకులూ కులం కార్డును స్వార్థానికి వాడుకుని జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారని ఎండగట్టిన తీరు బాగుంది. సినిమా టైటిల్ అందులో కంటెంట్ కాసేపు పక్కన పెడితే వర్మ ఆలోచనలో నిజాయితీ ఈ ఒక్క పాటలో కనిపించింది.

కాకపోతే కొన్ని లాజిక్స్ కరెక్ట్ గానే ఉన్నా కులం గొప్పదనం చెప్పుకోవాల్సిందే అనే రీతిలో సమర్ధన జరగడం కొన్ని చోట్ల సింక్ అవ్వలేదు. షూట్ చేయని పాట కాబట్టి సదరు కులాలకు చెందిన రాజకీయ నాయకుల ఫోటోలను వాడుకున్న వర్మ ఈ విషయంలో మాత్రం ఎవరిని వదల్లేదు. మరి సినిమాలో వీటి స్థానంలో ఏముంటుందో వేచి చూడాలి. వర్తమాన రాజకీయాలను చూపిస్తానని గతంలోనే ప్రకటించిన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత అంతకు మించిన వివాదాస్పద మెటీరియల్ తోనే వస్తున్నాడు. ఇప్పుడీ పాట ఆన్ లైన్ లో బాగానే చక్కర్లు కొడుతోంది