Begin typing your search above and press return to search.

క్యాజువ‌ల్లీ బ‌ట్ వెరీ హాట్ గురూ..!

By:  Tupaki Desk   |   30 March 2022 4:49 AM GMT
క్యాజువ‌ల్లీ బ‌ట్ వెరీ హాట్ గురూ..!
X
అందానికి అందం క‌వ్వించే త‌త్వం కొంద‌రికే సాధ్యం. ఈ కోవ‌కే చెందుతుంది శ్రీ‌లీల‌. శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్ స‌ర‌స‌న న‌టించింది ఈ బ్యూటీ. రోష‌న్ - శ్రీ‌లీల జంట‌గా కె.రాఘ‌వేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన పెళ్లి సంద‌-డి క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస‌వ్వ‌డంలో శ్రీ‌లీల పాత్ర విస్మ‌రించ‌లేనిది. ఈ బ్యూటీ అంద‌చందాల‌కు క‌వ్వించే యాటిట్యూడ్ కి యూత్ స్పెల్ బౌండ్ అయిపోయారు. టీనేజ‌ర్ల‌లోకి దూసుకెళ్లింది ఈ ఉత్త‌రాది భామ‌.

ప్ర‌స్తుతం నిర్మాత‌ల గుండెల్లో నిలిచి ఉన్న శ్రీ‌లీల‌కు వ‌రుస అవ‌కాశాలొస్తున్నాయి. దానికి త‌గ్గ‌ట్టే త‌న‌ని తాను లైమ్ లైట్ లో ఉంచుకునేందుకు త‌ను చేస్తున్న ప్ర‌య‌త్నం గొప్ప‌గానే ఉంది. తాజాగా శ్రీ‌లీల సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. దీనికి క్యాజువ‌ల్లీ అంటూ సింపుల్ ట్యాగ్ ఇచ్చింది. అయితే అభిమానులు మాత్రం వేరే విధంగా చూస్తున్నారు. క్యాజువ‌ల్లీ బ‌ట్ శ్రీ‌లీల టూ హాట్ గురూ! అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంతో స‌హ‌జంగా కనిపిస్తున్నా శ్రీ‌లీల క‌వ్వింత ఈ ఫోటోలో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది.

స్మోకీ క‌ళ్లు .. దోర దొండ పెద‌వులు.. దొడ్డు ముక్కుతో ఎంతో ముద్దొచ్చేస్తోంది.. అంటూ బోయ్స్ ఐస్ అయిపోతున్నారు.డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌రు అయ్యింది!

ఇక న‌టిగా తొలి సినిమాతోనే శ్రీ‌లీల‌ మంచి పెర్పార్మ‌ర్ గా నిరూపించుకుంది. సినిమా క‌మర్శియ‌ల్ గా పెద్ద స‌క్సెస్ కాన‌ప్ప‌టికీ శ్రీలీలకు మంచి పేరొచ్చింది. ఆ క్రేజ్ తోనే యంగ్ హీరోయిన్ కి ఇప్పుడు అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. మీడియం రేంజ్ హీరోలు స‌హా పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో ఆఫ‌ర్లు వ‌స్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ సినిమాల‌తో బిజీ అయ్యే ముందు ఎంబీబీఎస్ ప‌రీక్ష‌లు పూర్తి చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ఎంబీబీఎస్ చ‌దువుతుండ‌గా శ్రీలీల‌కు పెళ్లి సంద‌డిలో అవ‌కాశం రావ‌డంతో ముంబై నుంచి హైద‌రాబాద్ కి వ‌చ్చింది.

షూటింగ్ పూర్త‌య్యే వ‌ర‌కూ ఇక్క‌డే ఉంది. అయితే మొన్న‌నే కాబోయే డాక్ట‌రమ్మకు ప‌రీక్ష‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో సినిమా రిలీజ్ అనంత‌రం మ‌ళ్లీ ముంబై వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం స్ట‌డీస్ పైనే కాన్సంట్రేట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ ప‌రీక్ష‌లు అంటే మొక్క‌వోని దీక్ష‌తో చ‌ద‌వాలి. ఈ క్ర‌మంలో ప‌రీక్ష‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ మ‌న‌సు నుంచి సినిమాలో ఆలోచ‌ల్ని తీసేసి ప‌ర్తిగా చ‌దువుపైనే దృష్టి పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని నెల‌లు పాటు ముంబైలోనే ఉంటుంద‌ని స‌మ‌చారం. మ‌ళ్లీ ప‌రీక్ష‌లు పూర్త‌యిన అనంత‌రం హైద‌రాబాద్ కి తిరిగి రానుంద‌ని తెలుస్తోంది.

ఇక శ్రీలీల అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ ల విష‌యానికి వ‌స్తే మాస్ రాజా ర‌వితేజ క‌థ‌నాయ‌కుడిగా న‌టించ‌నున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా ఈ భామ‌నే ఎంపిక చేసారు. పోస్ట‌ర్లు వైర‌ల్ అవుతున్నాయి. అమ్మ‌డిలో డాన్స్ స్కిల్ చూసి కొంత మంది మీడియం రేంజ్ హీరోలు శ్రీలీల‌తో క‌లిసి నటించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అలాగే అగ్ర‌ నిర్మాణ సంస్థ‌లు యంగ్ బ్యూటీకి గ్రాండ్ గా వెల్క‌మ్ చెప్ప‌డానికి రెడీగా ఉన్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.