Begin typing your search above and press return to search.
బాలయ్యకు మళ్లీ మళ్లీ అదే సమస్య
By: Tupaki Desk | 18 Dec 2019 11:01 AM GMTటాలీవుడ్ సీనియర్ హీరోలందరికి కూడా హీరోయిన్ ఎంపిక విషయంలో సమస్యలు వస్తున్నాయి. ప్రతి హీరో కూడా సినిమా చేస్తున్న సమయంలో కొత్త అమ్మాయిలను తమ సినిమాల్లో తీసుకోలేక.. స్టార్ హీరోయిన్స్ తో చేద్దామంటే వయసు మరీ తక్కువ ఉండటంతో సీనియర్ హీరోయిన్స్ ను రిపీట్ చేయాల్సి వస్తుంది. నయనతార.. శ్రియ వంటి వారితో మళ్లీ మళ్లీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. స్టార్ హీరోల్లో బాలయ్యకు ముఖ్యంగా హీరోయిన్స్ తిప్పలు తప్పడం లేదు.
రూలర్ సినిమా కోసం సోనాల్ చౌహాన్ మరియు వేదికలను ఎంపిక చేయడం జరిగింది. వీరిద్దరు కూడా పెద్దగా క్రేజ్ లేని హీరోయిన్స్. సోనాల్ చౌహాన్ తో గతంలో నటించినా కూడా మళ్లీ బాలయ్య ఆమెతోనే చేయాల్సి వచ్చింది. ఇక త్వరలో చేయబోతున్న సినిమాకు ఛాన్స్ తీసుకోకుండా నోటెడ్ హీరోయిన్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య తదుపరి చిత్రం ఉండబోతుంది. ఆ సినిమా కోసం మొదట సోనాక్షి సిన్హాను సంప్రదించారంటూ వార్తలు వచ్చాయి.
సోనాక్షి స్పందిస్తూ తాను ఆ సినిమాలో నటించడం లేదు అంటూ ప్రకటించింది. సోనాక్షి నో చెప్పడంతో మరికొంత మందితో సంప్రదింపులు జరిపిన దర్శకుడు చివరకు కేథరిన్ తెర్సాను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. కేథరిన్ తెర్సా కు ప్రస్తుతం పెద్దగా క్రేజ్ ఏమీ లేదు.
అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడు బాలయ్య సరసన నటించే అవకాశం వచ్చినా కూడా ఏకంగా కోటి డిమాండ్ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. బాలయ్యతో మూవీ అనగానే హీరోయిన్స్ తమ రెగ్యులర్ పారితోషికంకు డబుల్ డిమాండ్ చేస్తారని టాక్ ఉంది. కేథరిన్ మరోసారి ఆ టాక్ ను నిజం చేసిందంటూ నెటిజన్స్ అంటున్నారు.
బాలయ్యకు జోడీగా ఆమెనే తీసుకోవాలని నిర్ణయించుకున్న బాలయ్య ఆమెకు 75 లక్షల వరకు ఇచ్చి ఈ చిత్రంలో చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. బోయపాటి సినిమాలు అంటే ఎక్కువ శాతం ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. మరి ఈ చిత్రంలో ఎంత మంది ఉంటారో చూడాలి. ఒక వేళ మరో హీరోయిన్ అవసరం అయితే ఎవరిని బోయపాటి తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. జనవరి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.