Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కిల్ల‌ర్ లుక్ తో కాక‌లు పుట్టించిన లేడీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   8 Aug 2021 2:30 AM GMT
ఫోటో స్టోరి: కిల్ల‌ర్ లుక్ తో కాక‌లు పుట్టించిన లేడీ ఎమ్మెల్యే
X
స‌రైనోడు చిత్రంలో లేడీ ఎమ్మెల్యేగా న‌టించి ఆక‌ట్టుకుంది కేథ‌రిన్ థ్రెసా. బెల్లంకొండ స‌ర‌స‌న `జ‌య జాన‌కి నాయ‌క` చిత్రంలోనూ న‌టించి మెప్పించింది. కానీ తెలుగులో పెద్ద రేంజు అవ‌కాశాలేవీ రాలేదు. ఆ క్ర‌మంలోనే క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న `బింబిసార‌` అనే పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలోని ఫాంట‌సీ డ్రామాలో నటిస్తోంది. ఇంత‌కుముందు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజై ఆక‌ట్టుకుంది.

ప్ర‌స్తుతం కేథ‌రిన్ సోష‌ల్ మీడియాల్లో అభిమానులకు ట‌చ్ లో ఉంది. మహమ్మారిని తట్టుకుని నిలబడటానికి మనం ఎలా కష్టపడుతున్నామో చూడాలంటేనే నా గుండె ముక్క‌ల‌వుతోంది. ఈ ఘోరమైన వైరస్ తో పోరాడటానికి మనకు ఆయుధాలున్నాయి అంటూ ఇంత‌కుముందు సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌జ‌ల్లో త‌న‌వంతు బాధ్య‌త‌గా ప్ర‌చారం చేసింది. సామాజిక సేవ‌లోనూ పాల్గొని ఎంద‌రినో ఆదుకుంది.

తాజాగా కేథ‌రిన్ మ‌రో హాట్ ఫోటోషూట్ తో అభిమానుల‌కు ట‌చ్ లోకి వచ్చింది. ఈసారి కిల్ల‌ర్ లుక్ తో మైండ్ బ్లాక్ చేసింది ఈ బ్యూటీ. ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో కేథ‌రిన్ ఎంతో హాట్ గా ద‌ర్శ‌నమిస్తోంది. బ్లాక్ లెద‌ర్ జాకెట్ లో పోష్ లుక్ తో క‌నిపించ‌గా రెడ్ హాట్ లుక్ తో .. గ్రీన్ బికినీతో కియరా అంద‌చందాలు ఒక్క‌సారిగా హీటెక్కించాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.