Begin typing your search above and press return to search.

క్యాథెరిన్ జిమ్ కష్టాలు చూశారా

By:  Tupaki Desk   |   4 Jan 2018 5:17 PM GMT
క్యాథెరిన్ జిమ్ కష్టాలు చూశారా
X
కన్నడ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన క్యాథెరిన్ ట్రెసా మొదటి అవకాశంతోనే అందరిని ఆకర్షించింది. మలయాళం తెలుగు అని తేడా లేకుండా అవకాశాలను దక్కించుకొని కొన్ని రోజులకే బిజీ అయిపోయింది. ఇక కోలీవుడ్ లో కూడా ఈ పైసా బ్యూటీ ప్రస్తుతం బిజీ అవుతోంది. అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఏడేళ్లు అవుతున్నా ఇంకా అందంలో ఏ మాత్రం తేడా రనివ్వ లేదు.

తనదైన శైలిలో అందాన్నీ మెయింటెన్ చేస్తూ వస్తోంది. అంతే కాకుండా ఫిట్ నెస్ లో అమ్మడు చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో క్యాథెరిన్ సోయగాలు ఐటెమ్ సాంగ్స్ కి కూడా బలే ఉపయోగపడుతున్నాయి. అప్పుడప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ కూడా చేస్తోంది. అమ్మడు 2017 లో చాలా వరకు బిజిగానే కనిపించింది. ఇక 2018 లో కూడా అదే తరహాలో బిజీ అయ్యేందుకు ఫిట్ నెస్ పై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటోంది.

ప్రస్తుతం జిమ్ లోనే ఎక్కువగా కనిపిస్తోందట. రీసెంట్ గా అమ్మడు జిమ్ వర్కౌట్స్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ బ్యూటీ కష్టాన్ని చూసి నెటీజన్స్ షాక్ అవుతున్నారు. అంతే కాకుండా ఆమె జిమ్ డ్రెస్ లో కొంచెం హాట్ గా కూడా కనిపిస్తోంది. అధిక బరువును మోస్తూ సెక్సీ షేపులను తెచ్చుకోవడానికి చాలా వర్కౌట్స్ చేస్తోంది. ఇక క్యాథెరిన్ ప్రస్తుతం కళకళప్పు 2 అనే తమిళ్ సినిమాలో నటిస్తోంది. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో జీవా కథానాయకుడు.