Begin typing your search above and press return to search.
దాసరిని కలిసినా.. మద్రాస్ వెళ్లినా!?
By: Tupaki Desk | 28 Jun 2015 9:39 AM GMTబన్ని లాంటి స్టార్ హీరో సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించింది కేథరిన్. ఆ సినిమా తర్వాత స్కైలో ఉంటుందని ఊహించారంతా. కానీ కుప్పకూలిన హెలీకాఫ్టర్‌లా ఫ్లాప్‌ల్లో ఉండిపోయింది. చివరికి ఎర్రబస్సు అయినా అమ్మడిని రక్షించలేకపోయింది. దాసరి నారాయణరావు అంతటి దిగ్గజమే 'ఎర్రబస్సు' ద్వారా ఈ భామ జాతకాన్ని మార్చలేకపోయాడంటే లోపం ఎక్కడుందో? అనుకున్నారంతా.
చివరికి తెలుగులో సరిగా లేదని తమిళపరిశ్రమ వైపు వెళ్లింది. అక్కడ కార్తీ లాంటి స్టార్ సరసన 'మద్రాస్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలిసినిమాతోనే ఉత్తమ డెబ్యూ నాయికగా ఫిలింఫేర్ అందుకుంది. అయితే ఇదంతా గతం. దుబాయ్ నుంచి కోటి ఆశలతో వచ్చిన ఈ అమ్మడు తెలుగు, తమిళ్‌లో పెద్ద స్టార్ అయిపోతుందనే జోశ్యం చెప్పారు కొందరు. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఎటూగాకుండా పోయింది. ఏదేమైనా ఇప్పుడు క్యాథరిన్‌ని మళ్లీ ఎందుకు గుర్తు చేసుకోవాల్సొచ్చిందంటే నిన్నటిరోజున ఫిలింఫేర్ వేడుకల్లో ఎందరో కొత్త నాయికలు అవార్డులు అందుకుంటూ రేసులో దూసుకుపోతుంటే వాళ్లకంటే కేథరిన్‌కి ఏం తక్కువ? అన్న ఆలోచన ఛమక్కున మెరిసింది.
అయితే ఈ అమ్మడిలో అందం ఉంది. కానీ అభినయంలోనే మెరుగైన ఫలితం కనిపించలేదు. అందుకే అన్నిచోట్లా ప్రేక్షకులు నిర్ధయగా తరిమికొట్టారని విశ్లేషించాల్సొస్తోంది. అదీ సంగతి.