Begin typing your search above and press return to search.

ఐటెం సాంగుకే ఒక సినిమాకు ఇచ్చినంత‌?

By:  Tupaki Desk   |   5 July 2017 5:44 AM GMT
ఐటెం సాంగుకే ఒక సినిమాకు ఇచ్చినంత‌?
X
అందం ఉన్నా సినిమా ఇండ‌స్ట్రీలో కొన్నిసార్లు వ‌ర్క్ వుట్ కాదు. అవ‌కాశాలు వ‌చ్చినా బ్రేక్ మాత్రం రాదు. ఇలాంటి ప‌రిస్థితే క్యాథ‌రిన్ థెరీసా విష‌యంలోనూ క‌నిపిస్తుంది. పాలుగారే ఈ ముద్దుగుమ్మ ముద్దు ముద్దుగా ఉంటుంది. అందాల ఆర‌బోత‌కు పెద్ద‌గా అభ్యంత‌రం చెప్ప‌దు.

ఇద్ద‌ర‌మ్మాయిలు చిత్రంలో అమ‌లాపాల్ తో క‌లిసి బ‌న్నీతో అందాల్ని ఎంత‌గా ఆర‌బోసినా స‌రైన బ్రేక్ అయితే రాలేదు. అలాంటిది క్యాథీ ఐటెమ్ సాంగ్‌ కు ఓకే చెప్పి అంద‌రి దృష్టిని త‌న‌పై ప‌డేలా చేసుకుంది. కొన్ని సంద‌ర్భాల్లో ఐటెమ్ సాంగ్ వ‌ర్కవుట్ అవుతుంది కానీ.. రిస్కే ఎక్కువ‌. ఐటెమ్ భామ‌గా రిజిస్ట‌ర్ అయితే.. హీరోయిన్ గా ఛాన్స్‌లు గాల్లో క‌లిసిపోయిన‌ట్లే.

ఈ విష‌యాన్ని క్యాథీ గుర్తించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఐటెమ్‌ కు ఓకే అన్నాక‌.. మ‌ళ్లీ అలాంటి అవ‌కాశాలే వ‌చ్చేస్తుంటాయి. తాజాగా ఆమెకు ఇలాంటి అనుభ‌వ‌మే ఎదుర‌వుతోంది. హీరోయిన్ గా ఛాన్స్ లు రాకున్నా.. ఐటెమ్ భామ‌గా మాత్రం ఛాన్స్‌ల మీద ఛాన్స్ లు వ‌స్తున్నాయి. అయితే.. ఇలాంటి అవ‌కాశాల్ని నిర్మొహ‌మాటంగా తిర‌స్క‌రిస్తోంది.

మ‌రి.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టిస్తున్న జై జాన‌కి నాయ‌క చిత్రంలో ఐటెమ్‌ కు ఆడేశారు క‌దా? అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. పెద్ద ముచ్చ‌టే చెబుతోంది. ఈ ఐటెమ్‌ ను బోయ‌పాటి కోస‌మే చేశాన‌ని.. స‌రైనోడులో త‌న‌కు అవ‌కాశం ఇచ్చినందుకు ప్ర‌తిగా.. ఆయ‌న అడిగార‌ని ఓకే చెప్పిన‌ట్లుగా చెబుతోంది. ఇక‌పై.. ఎవ‌రు అడిగినా తాను మాత్రం ఓకే చెప్పేది లేద‌ని తేల్చి చెబుతోంది. అయితే.. బోయ‌పాటి కోసం ఓకే అన్న ఐటెమ్‌ కు సొమ్ము కూడా భారీగానే ముట్టింద‌ట‌. ఎంత అంటే... సాధార‌ణంగా ఇచ్చే లెక్క‌కు మూడు నాలుగు రెట్లు ఎక్కువిచ్చారంటున్నారు.