Begin typing your search above and press return to search.
ఎంఎల్ ఎ ని వదలని బోయపాటి శ్రీను
By: Tupaki Desk | 27 Nov 2018 5:23 PM GMTబోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా 'వినయ విధేయ రామ' టైటిల్ తో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. అయితే ఈ సినిమా కోసం దేవీ ఒక పవర్ఫుల్ ఆల్బం రెడీ చేస్తున్నాడని.. అందులో ఒక ఊర మాస్ ట్యూన్ హైలైట్ గా ఉంటుందని..ఇదొక పవర్ఫుల్ ఐటెం సాంగ్ అని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
మరి ఈ సినిమాకోసం దేవీ పవర్ఫుల్ ఐటెం నెంబర్ కు ట్యూన్ రెడీ చేస్తున్నాడు సరే గానీ చరణ్ సరసన డ్యాన్సు చేసే ఐటెమ్ భామ ఎవరు? తాజా సమాచారం ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేసింది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కు చరణ్ సరసన 'సరైనోడు' ఎంఎల్ఎ క్యాథరిన్ ట్రెసా డ్యాన్స్ చేస్తుందట. క్యాథరిన్ ట్రెసా సెకండ్ హీరోయిన్ గా చాలా సినిమాల్లోనే నటించినా మంచి పాపులారిటీ వచ్చింది మాత్రం బోయపాటి సూపర్ హిట్ ఫిలిం 'సరైనోడు' తోనే. ఆ సినిమా తర్వాత 'జయ జానకి నాయక' సినిమాలో కూడా క్యాథరిన్ కు అవకాశం ఇచ్చాడు బోయపాటి. ఇప్పుడు మరో సారి చరణ్ సినిమాలో ఆమెకు క్రేజీ ఆఫర్ దక్కింది.
చరణ్ నిర్మాణంలో తెరకెక్కిన 'ఖైది నంబర్. 150' లో రత్తాలు రత్తాలు పాటకు మొదట్లో క్యాథరిన్ నే తీసుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో తనకు బదులుగా రాయ్ లక్ష్మితో రీప్లేస్ చెయ్యడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో బోయపాటి చరణ్-క్యాథరిన్ ఐటెం సాంగ్ సెట్ చేయడం విశేషమే.