Begin typing your search above and press return to search.

వాలుకళ్ల వల విసిరే చేపకళ్ల చిన్నది

By:  Tupaki Desk   |   10 Feb 2021 6:30 AM GMT
వాలుకళ్ల వల విసిరే చేపకళ్ల చిన్నది
X
సాగరకన్యలు ఉన్నారనే చాలామంది నమ్ముతుంటారు. సముద్రంలో వాళ్లు అలా అలా తేలుతూ వెళుతుంటే చూడటానికి ఓ అరడజను కళ్లు అరువు తెచ్చుకోవాలనిపిస్తుంది. వాళ్ల రెక్కలు పట్టుకుని ఆనందాల లోతులను తాకాలనిపిస్తుంది. మురిపాల ముత్యాలను ఏరుకోవాలనిపిస్తుంది. మరి అంతటి అందంగా కనిపించే సాగరకన్యలు .. ఒడ్డుకు వస్తే బతుకుతాయా అనే సందేహం చాలామందికి ఉండి ఉంటుంది. అలాంటి అనుమానమే అవసరం లేదు .. నేలపై అవి హాయిగా తిరుగుతాయి .. కుర్రాళ్ల హృదయాల్లో ఎగురుతాయి. అందుకు నిదర్శనంగా కేథరిన్ కనిపిస్తూనే ఉందిగదా.

చేప పొలుసు రంగు డ్రెస్ లో కేథరిన్ నిజంగానే మత్స్య కన్యలానే మెరిసిపోతోంది కదూ. ఈ డ్రెస్ నే కాదు .. ఏ డ్రెస్ లోనైనా ఆమె చాలా గ్లామరస్ గా ఉంటుంది. ఎందుకంటే సహజంగానే ఆమె మంచి అందగత్తె. వజ్రానికి గోల్డ్ కలర్ కోటింగ్ అవసరం లేదనేంత గ్లామర్ ఆమె సొంతం. ఆమె కళ్లు అప్పుడే విచ్చుకున్న కలువపువ్వుల్లా ఉంటాయి .. ఆమె చూపులు కొంటె మనసులను కొల్లగొట్టే కిరణాల్లా ఉంటాయి. ఆమె పెదాలు చెర్రీ పళ్ల తోటల్లా .. తేనె ఊటల్లా ఉంటాయి. ఒకే సమయంలో ఆమె ఎంతమంది అభిమానుల కలల్లోకి ఎంట్రీ ఇస్తుందో ఆమెకేం తెలుసు.

ఇప్పుడు ఫామ్ లో ఉన్న కథానాయికలతో పోల్చుకుంటే కేథరిన్ కి ఏ విధంగానూ తక్కువ మార్కులు వేయలేం. మత్తుకళ్లతో చిత్తుచేయగల అందమైన ఆయుధం ఆమె. అలాంటి కేథరిన్ కి ఎందుకో తెలుగు ఇండస్ట్రీలో సరైన పట్టు దొరకడం లేదు. అవకాశాలు వచ్చినట్టే వచ్చి జారిపోతున్నాయి .. లేదంటే పరాజయాలను పట్టుకుని పారిపోతున్నాయి. సరైన కథ .. పాత్ర పడాలేగానీ ఆమె కెరియర్ ఊపందుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అప్పటివరకూ కేథరిన్ ఇలా సోషల్ మీడియాలో సందడి చేయవలసిందే. ఎందుకంటే ఈ కాలం కుర్రాళ్లకి సవాలక్ష పనులు .. వాళ్లు మరిచిపోకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా ఆమెదే!