Begin typing your search above and press return to search.
ప్రభాస్ - పవన్ తో చేయనన్న యాపిల్ బ్యూటీ
By: Tupaki Desk | 6 Jan 2018 4:30 AM GMTహీరొయిన్ గా తన ఖాతాలో ఎన్ని హిట్లు ఉన్నాయి అన్నది పక్కన పెడితే తక్కువ టైంలోనే టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న క్యాథరిన్ త్రెస్సా ప్రేక్షకులకు సరైనోడు సినిమాలో ఎమెల్యేగానే బాగా గుర్తు. పైసా సినిమాతో పరిచయమైన క్యాథరిన్ లాస్ట్ ఇయర్ నేనే రాజు నేనే మంత్రి రూపంలో పెద్ద హిట్టే అందుకుంది. జయజానకి నాయక సినిమాలో ఐటెం సాంగ్ తో అలరించిన ఈ యాపిల్ బ్యూటీ ఇటీవలే ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రత్యేక ముచ్చట్లు షేర్ చేసుకుంది. వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకునే సమస్యే లేదని - కథ విషయంలో చాలా అలోచించి నిర్ణయం తీసుకుంటాను అన్న క్యాథరిన్ కొన్ని విషయాల పట్ల తనకున్న స్పష్టతను వివరించింది. ప్రభాస్ కు అక్కయ్యగా - పవన్ కళ్యాణ్ కు వదినగా ఆఫర్స్ వస్తే వదిలేస్తాను అన్నది కాని అసలు తనను ప్రేక్షకులు కాదు దర్శక నిర్మాతలు సైతం ప్రస్తుతానికి అలా ఊహించుకోలేరు.
పెళ్లి విషయంలో మాత్రం తెలుగు అబ్బాయినే చేసుకోవాలనుందని తన మనసులో మాట బయట పెట్టింది. తనలో ప్రత్యేక ఆకర్షణ తన కళ్ళే అని, ఇది తన మాట కాదని కృష్ణవంశీ - నీలకంట - బోయపాటి శీను వీళ్ళంతా వాటి గురించే మెచ్చుకోవడం తను మర్చిపోలేను అంది. క్యాథరిన్ పుట్టింది దుబాయ్ లో. కన్నడ సినిమా శంకర్ ఐపిఎస్ తో దునియా విజయ్ సరసన పరిచయమైన క్యాథరిన్ తెలుగులో చమ్మక్ చల్లో తో ఎంట్రీ ఇచ్చింది. కృష్ణ వంశీ పైసా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా తనకు పేరు మాత్రం ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో బ్రేక్ ఇస్తే సరైనోడు ఇక్కడ ఉండే భరోసా ఇచ్చింది. తెలుగులో అవకాశాలకే ప్రాధాన్యం ఇస్తున్నాను అన్న క్యాథరిన్ పెళ్లి విషయంలో మాత్రం తొందరపడే ప్రసక్తి లేదు అని తేల్చేసింది.