Begin typing your search above and press return to search.
మరోసారి బికినీ వేయడానికి రెడీ
By: Tupaki Desk | 9 Oct 2017 7:31 AM GMTమొదట కన్నడ - మలయాళం సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న భామ క్యాథెరిన్ ట్రెసా. అయితే ఈ భామ టాలీవుడ్ లోకి వచ్చాక ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గానే నటిస్తోంది. స్టార్ హీరోల సినిమాలు వస్తే ఏ మాత్రం రిజెక్ట్ చేయకుండా వచ్చినది చిన్న పాత్ర అయినా సరే ఒకే చేస్తోంది. అంతే కాకుండా తన నటనతో సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మొన్నటి వరకు నటించిన సినిమాలు క్యాథెరిన్ కి మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. అయితే మొదటి సారి ఇప్పుడు అమ్మడికి మెయిన్ లీడ్ లో నటించే అవకాశం దక్కింది. రవి తేజ హీరోగా 'బోగన్' అనే ఒక తమిళ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయ్యింది. అదే తరహాలో సినిమాను తియ్యడానికి తమిళ దర్శకుడు ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ అయ్యారట. అయితే ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా ముఖ్యం. కాకపోతె ఈ పాత్రకు చాలామంది పెద్ద పెద్ద హీరోయిన్లను అనుకుని.. చివరకు క్యాథరీన్ కు ఇచ్చారు. దానికి కారణం ఆమె నేను రాజు నేనే మంత్రి సినిమాలో చాలా పొగరుగా ఉన్న క్యారెక్టర్లో నటించడమే. ఆ రోల్ చూసి ఫ్లాట్ అయిపోయి ఈ రోల్ ఇచ్చేశారని అమ్మడు చెబుతోంది.
అయితే మొన్నటివరకు కేవలం గ్లామర్ తో నెట్టుకొచ్చిన క్యాథరీన్.. ఈ మధ్యన బికినీల్లో కూడా మెరిసింది. అందుకే మరోసారి ఈ బోగన్ రీమేక్ లో కూడా అలాంటి గ్లామర్ ఫీట్లే చేయబోతోందని తెలుస్తోంది. దానికితోడు బికినీల్లో ఆరబోయడానికి భారీగానే పుచ్చుకుంటోందట. ఇకపోతే ప్రస్తుతం రవితేజ రాజా ది గ్రేట్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే ప్రమోషన్స్ ని కూడా ఎక్కువగా చేయనున్నాడట. దీంతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుందుకు కాస్త సమయం పట్టవచ్చని తెలుస్తోంది.