Begin typing your search above and press return to search.

అసలు క్యాథరీన్ ను అడగనేలేదు

By:  Tupaki Desk   |   5 Feb 2018 9:38 AM GMT
అసలు క్యాథరీన్ ను అడగనేలేదు
X
అస‌లు రూమ‌ర్లు ఎక్క‌డ నుంచి పుడ‌తాయో అంటూ ఆశ్చ‌ర్య ప‌డిపోతోంది క్యాథ‌రీన్‌. ఎందుకంటే ఈ అమ్మడి గురించే ఒక పుకారు షికారు చేస్తోంది మ‌రి. తీరా చూస్తే కొంద‌రు అస‌లు నిప్పు లేకుండానే పొగ పుట్టించేశార‌ని తేలింది.

త‌మిళ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌నితాన్‌. రెండేళ్ల క్రితం నాటి సినిమా. ఇందులో అధ‌ర్వ హీరో అయితే, క్యాథ‌రీన్ క‌థానాయిక‌. సినిమా హిట్ కొట్టింది. దీంతో మిగ‌తా భాషల్లోకి రీమేక్ అవ్వ‌డం కామ‌నే క‌దా. అలాగే తెలుగులో కూడా ఈ సినిమా రీమేక్ కు సిద్ధ‌మ‌వుతోంది. త‌మిళ సినిమాలో అద‌ర‌గొట్టిన క్యాథ‌రీన్ హీరోయిన్ అని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అంద‌రూ న‌మ్మేశారు. తీరా చూస్తే క్యాట్ అస‌లు విష‌యాన్ని చెప్పింది. అస‌లు త‌న‌ను ఇంత‌వ‌ర‌కు తెలుగు రీమేక్ లో న‌టించ‌మ‌ని అడ‌గేలేదు అని బాంబు పేల్చింది. అస‌లు ఇలా పుకార్లు ఎలా పుడ‌తాయో అని ఆశ్చ‌ర్య‌పోతోంది. సినీ జ‌నాలు మాత్రం త‌మిళంలో అద్భుతంగా న‌టించిన క్యాథ‌రీన్‌ ను తెలుగులో కూడా పెట్టి తీస్తే త‌ప్పేంటో అంటున్నారు. ఏమో చివ‌రికి ఈ అమ్మ‌డే హీరోయిన్‌గా క‌న్ఫామ్ అయినా పెద్ద ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

తెలుగు రీమేక్‌లో కూడా క్యాథ‌రీన్ కు హీరోయిన్ పాత్ర ద‌క్కితే అమ్మ‌డి ద‌శ తిరిగిన‌ట్టే. ఎందుకంటే క‌నితాన్ క‌థ బాగుంద‌ని ఇప్ప‌టికే బోలెడు మంది కితాబిచ్చేశారు. త‌మిళ క‌నితాన్ లో హీరోయిన్ పాత్ర నిడివి చిన్నగా ఉంది. తెలుగు రీమేక్ లో మాత్రం... హీరోయిన్ పాత్ర నిడివి పెంచుతున్నార‌ని టాక్‌. అంతేకాదు ప్రాధాన్య‌త కూడా పెంచుతార‌ట‌. ఇంకేం అలాంటి పాత్ర మ‌ళ్లీ క్యాథ‌రీన్ ఖాతాలో ప‌డితే... పిల్ల‌కి మ‌రిన్ని సినిమా అవ‌కాశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆమె సినిమాల‌లో ఇద్ద‌ర‌మ్మాయిలు - స‌రైనోడు త‌ప్ప పెద్ద గుర్తు తెచ్చిన పాత్ర‌లే లేవు. కనుక ఇప్పుడు క్యాథ‌రీన్ కు తెలుగులో బ్రేకిచ్చే చిత్రం చాలా అవ‌స‌రం. లేకుంటే ప్యాక‌ప్ అయిపోవాల్సిందే.